మరో సంచలన నిర్ణయంతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన విరాట్‌ కోహ్లీ..!

భారత్ లో ప్రారంభమై కరోనా ధాటికి అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ పునః ప్రారంభమైంది.ఐపీఎల్ ద్వితీయార్థం షార్జా, అబుదాబి, దుబాయ్‌ వేదికగా జరుగుతోంది.

 Virat Kohli To Step Down As Rcb Captain After Ipl 2021, Ipl 2021, Dubai, Virat K-TeluguStop.com

దాంతో క్రికెట్ అభిమానులు బౌండరీల జోరును మళ్ళీ చూసే సమయం ఆసన్నమైందని సంతోషంలో మునిగితేలుతున్నారు.ఈ నేపథ్యంలోనే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేసి ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చారు.

ప్రత్యేకించి ఆర్సీబీ ఫ్యాన్స్‌ను దిగ్భ్రాంతికి గురిచేశారు.ఇటీవలే భారత టీ20 ఫార్మాట్ నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నానని కోహ్లీ ప్రకటించిన సంగతి విధితమే.

ఇంకా ఆ బ్యాడ్ న్యూస్ నుంచే అభిమానులు బయటపడలేదు.ఈ క్రమంలోనే వరుస ప్రకటనలు చేస్తూ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు కోహ్లీ కుండబద్దలు కొట్టారు.

ఐపీఎల్లో కెప్టెన్‌గా 2021 సీజనే తనకు ఆఖరిదని ప్రకటించిన కోహ్లీ.కెరీర్ చివరి వరకూ బెంగళూరు జట్టుకే ఆటగాడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.దాంతో ఇకపై ఐపీఎల్ లో విరాట్ కోహ్లీని కేవలం ఒక సాధారణ ఆటగాడిగా మాత్రమే చూడాల్సి వస్తుంది. ‘‘బెంగళూరు కెప్టెన్‌గా ఇదే నా చివరి ఐపీఎల్‌.

ఫ్రాంఛైజీ ప్రయోజనాల దృష్ట్యా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని భావిస్తున్నాను.గతంలో చెప్పినట్లు క్రికెటర్‌గా నా కెరీర్‌ ముగిసేవరకు బెంగళూరు జట్టులోనే కొనసాగుతాను.

ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు” అని కోహ్లీ వెల్లడించారు.కోహ్లీ ప్రకటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ షేర్ చేసింది.

విరాట్ కోహ్లీ ఐపీఎల్ మొదలైన 2008 నుంచి బెంగళూరు జట్టులోనే కొనసాగతున్నారు.2011లో ఆ జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ తొమ్మిదేళ్లు నాయకుడిగా కొనసాగారు.కానీ ఒక్కసారైనా టీమ్ కు కప్ తెచ్చి పెట్టలేకపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube