అత్యద్భుతమైన, చెత్త రికార్డు రోహిత్ శర్మకే సొంతం

ఇండియాలో క్రికెట్‌ను అభిమానించని వారు లేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రతీ ఒక్క క్రికెటర్ గురించి దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చర్చించుకుంటారు.

 Outstanding And Also Worst Record Belongs To Rohit Sharma, Rohith Sharma, Cricke-TeluguStop.com

క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు తమ పనులు పక్కన పెట్టేసి అదే పనిగా మ్యాచ్ చూస్తుంటారు.కాగా, క్రికెట్ అభిమానులకు ఇష్టమైన ఐపీఎల్ 2021 ప్రారంభం కాబోతున్నది.

ఈ నేపథ్యంలో క్రికెటర్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ స్టోరి.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ హిస్టరీలో ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్ శర్మ పేరిట చెక్కు చెదరని రికార్డులతో పాటు అత్యంత చెత్త రికార్డు కూడా నమోదు కావడం గమనార్హం.2011 నుంచి ముంబై ఇండియన్స్‌లో భాగమైన ఈ హిట్‌ మ్యాన్‌ తన సారథ్యంలో జట్టును ఐదు సార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు.ఐపీఎల్‌ హిస్టరీలో ఇప్పటివరకు ఏ జట్టు ఇన్ని టైటిల్స్‌ నెగ్గలేదు.

ఇది అత్యద్భుతమైన రికార్డు కాగా, ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డును కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకన్నాడు.క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రోహిత్‌ ఏకంగా 13 సార్లు డకౌటయ్యాడు.

ఈ వరస్ట్ రికార్డును రోహిత్ శర్మతో పాటు హర్భజన్‌ సింగ్, రహానే, అంబటి రాయుడు, పార్ధివ్‌ పటేల్‌ షేర్‌ చేసుకున్నారు.

Telugu Times Duckoouts, Cricket, Duckoutsrohith, Ipl Mi, Mumbai Indians, Rhith S

రోహిత్‌ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన స్టార్ క్రికెటర్స్‌లో మ్యాక్స్‌వెల్, మనీష్ పాండే, రషీద్ ఖాన్, ధవన్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, సంజూ సామ్సన్, సురేశ్ రైనా ఉన్నారు.మనీష్ పాండే పన్నెండు సార్లు డకౌట్ కాగా, మ్యాక్స్‌వెల్, ధవన్ పదకొండు సార్లు డకౌట్ అయ్యారు.ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 207 మ్యాచ్‌ల్లో 130కు పైగా స్ట్రయిక్‌ రేట్‌లో 5,480 పరుగులు చేశాడు.

ఆదివారం జరగబోయే ఐపీఎల్‌ సెకెండ్‌ ఎడిషన్‌ స్టార్టింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube