కేటీఆర్ టార్గెట్ గానే ప్రతిపక్షాల భవిష్యత్తు రాజకీయం ఉండనుందా?

కేసీఆర్ తరువాత అంతటి చరిష్మా ఉన్న నేతగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ కేసీఆర్ స్టైల్ లో కాకుండా తన కంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న విషయం తెలిసిందే.ప్రజలు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు.

 Should The Future Politics Of The Opposition Be The Same As The Ktr Target, Ktr,-TeluguStop.com

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ కూడా కేసీఆర్ తో సమానంగా అత్యధిక ప్రచార సభలలో పాల్గొనే అవకాశం ఉంది.కావున ఆ సమయం వరకు కేటీఆర్ స్థాయిని తగ్గిస్తే గెలుపుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నది ప్రతిపక్షాల వ్యూహాత్మక ఎత్తుగడ.

అందుకే కేటీఆర్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అంతేకాక ఈ సారి టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉండే అవకాశం లేదు.

పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశం ఉంది.కావున టీఆర్ఎస్ కీలక వ్యక్తులే టార్గెట్ గా ప్రతిపక్షాల విమర్శల వ్యూహ రచన ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే తన మంత్రి వర్గ పనితీరులో మాత్రం కెటీఆర్ కు మంచి మార్కులే పడ్డాయి.అయితే ఇప్పటివరకు కెటీఆర్ కు పెద్దగా రాజకీయంగా దెబ్బ తీసే విషయాలు ఏమీ లేకున్నా రాజకీయంగా కఠిన పరిస్థితులు కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ఎదురుకావడం అన్నది సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ కీలక మైన విషయం అని చెప్పకతప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube