ఇది విన్నారా.. ట్రక్కు డ్రైవర్ కు రూ. 70.88 లక్షల జీతమంట..!

డిగ్రీలు, ఎంబీఏలు, ఎంటెక్ లు చేసి ఉద్యోగం చేసే వారి జీతం ఎంత అంటే రూ.40 వేలో, రూ.50 వేలో అంటూ ఉంటారు.అదే కాస్త ఎక్సపీరీయన్స్ వాళ్ళని అడిగితే ఒకటో రెండో లక్షలు అంటారు.

 Have You Ever Heard 70 Lakh Salary For A Truck Driver In Britain, Truck Drivers,-TeluguStop.com

అదే కొన్ని ఉద్యోగాలు ఎంత కష్టపడినా జీతాలు అంతంత మాత్రంగానే వస్తాయి.కొన్ని ఉద్యోగాల్లో ఏ మాత్రం కష్ట పడకుండా లక్షల్లో సంపాదిస్తారు.

అలాంటి వాటిల్లో కొన్ని కూర్చుని సంపాదించేవి, ఇంకొన్ని నిద్రపోతూ సంపాదించేవి, మరికొన్ని రుచి చూసి భారీగా సంపాదించేవి ఉన్నాయి.అదే లారీ డ్రైవరో, బస్ డ్రైవరో, కార్, ట్రక్ డ్రైవర్లో అయితే ఓ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.అయితే చదువు లేకున్నా, డిగ్రీ లు, పీజీ లు లేకున్నా ఆ దేశంలోని ట్రక్ డ్రైవర్ కి మాత్రమే ఓ రెంజీలో జీతాలు ఇస్తారట.ఇంతకీ ఆ జీతాలు ఎంతుంటాయి అనుకుంటున్నారా అక్షరాల రూ.70 లక్షల పైనే అంట.ఇంకా చెప్పాలంటే రూ.79.88 లక్షల అంట.

ఇంతకీ ఆ దేశం ఎక్కడంటే బ్రిటన్ లో అంట.అక్కడ సూపర్ మార్కెట్ లో సరుకులు డెలివరీ చేసే ట్రక్ డ్రైవర్లకు సంవత్సరానికి 70 వేల పౌండ్లు ఇస్తారట.మన ఇండియా కరెన్సీ లోకి మారిస్తే సుమారు రూ.70 లక్షల 88 వేల 515 లు.పని దినాలను బట్టి 100 ల సంఖ్యలో మార్పు రావొచ్చట.అంతే కాదండోయ్ జీతం కాకుండా పైన 2 వేల పౌండ్లు అంటే సుమారు రూ.2,02,521 బోనస్ కూడా వస్తుందట.బ్రిటన్ లో లక్ష కు పైగా డ్రైవర్లకు భారీ డిమాండ్ ఉందంటే అక్కడ ఏ రేంజ్ లో జీతాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

కానీ అక్కడ ట్రక్ డ్రైవర్ల హెడ్ కు కూడా అంత భారీ జీతాలు ఉండవంట.

Telugu Salary, Englandtruck, Demandbritish, Offered, Rs, Truck Drivers, Latest-L

టెస్కో, సెన్స్ బరీ లాంటి కంపెనీలకు చెందిన రిక్రూటర్లు భారీ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి.అక్కడ ట్రక్ డ్రైవర్లకు భారీ డిమాండ్ ఉండడం తో మంచి అనుభవమున్న డ్రైవర్లను భారీగా జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారు.

ఈ విషయం గురించి బెర్రీ అనే ఓ ట్రక్ డ్రైవర్ మాట్లాడుతూ తనకు వారంలో ఐదు రోజులు డ్యూటీ ఉంటుందని, ఏజెంట్ల ద్వారా మంచి జీతం తో పాటు బోనస్ రెండు వేల రూపాయలు కూడా వస్తుందని అన్నాడు .అలాగే తన బాస్ కి తనకు ఇచ్చే జీతం లో సగం కూడా ఉండదని తెలిపాడు.అయితే జీతం కోసం అయినా ట్రక్ డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోవాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube