వైరల్ వీడియో: చీకటి ఎలా పడుతోందో ఆకాశం నుంచి ఎప్పుడైనా చూసారా..?

అంతరిక్ష యానంలో అద్భుతమైన మార్పులకు నాంది పలికిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ.ఇప్పుడు మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి నడుం కట్టింది.

 Viral Video Have You Ever Seen The Night Coming From The Sky, Space, Viral Lates-TeluguStop.com

తాజాగా ఈ సంస్థ అంతరిక్షంలోకి డ్రాగన్‌ ‍క్యూపోలా అనే ఒక అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టింది.ఈ స్పేస్ షిప్ ద్వారా అంతరిక్షం నుంచి భూగ్రహాన్ని అద్భుతంగా ఫొటోలు, వీడియోలు తీయొచ్చు.

భూమి అందాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి, కెమెరాలో బంధించడానికి వీలుగా డ్రాగన్‌ ‍క్యూపోలాని 585 కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టింది స్పేస్‌ ఎక్స్‌ సంస్థ.సెప్టెంబర్ 15న ఇన్సిపిరేషన్‌ 4 మిషన్‌లో భాగంగా డ్రాగన్‌ క్యూపోలాను ప్రయోగించింది.ఈ మానవసహిత స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించారు.వీరంతా ఇప్పుడు అంతరిక్షం లో చక్కర్లు కొడుతూ డ్రాగన్‌ స్పేస్‌ షిప్‌లోనే ఉన్నారని సమాచారం.

నిజానికి గతంలో పలు అంతరిక్ష సంస్థలు భూగోళాన్ని పైనుంచి చూసేందుకు వీలుగా స్పేస్‌షిప్‌లను పంపించాయి.

కానీ భూమిని సరిగ్గా వీక్షించేందుకు వాటిలో ఏ ఒక్కటి కూడా అనువుగా ఉండలేదు.ఏ సంస్థ కూడా ఇప్పటివరకు భూమిని వీక్షించేందుకు సరైన ఏర్పాట్లను చేయలేకపోయాయి.కానీ ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఇన్సిపిరేషన్‌ 4 మిషన్‌లో భాగంగా ట్రాన్స్‌పరెంట్‌ మెటీరియల్‌ ను ఉపయోగించింది.అంతేకాకుండా, భూమి చక్కగా కనిపించేందుకు క్యూపోలాను చాలా పెద్దగా రూపొందించింది.

దాంతో అంతరిక్షం నుంచి భూమిని స్పష్టంగా చూసేందుకు సాధ్యపడింది.

తాజాగా డ్రాగన్‌ క్యూపోలా ప్రయాణికులు. భూమిపై చీకటి పడుతుండగా ఎలా ఉంటుందో అందరికీ చూపించేందుకు భూమిపై చీకటి పడే దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.అనంతరం ఆ వీడియోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.ఆ వీడియోలో.

అంతరిక్షం నుంచి చూస్తుంటే భూగ్రహం సగం వరకు చీకటి పడుతూ మిగిలిన సగం వెలుతురు పొందుతూ కనిపించింది.క్రమక్రమంగా భూ గ్రహం పై ఒక పక్క చిమ్మ చీకటి ఆవహించింది.

ఈ దృశ్యాలు తీస్తున్న సమయంలో స్పేస్ షిప్ ఉన్న వైపే చీకటి పడింది.దాంతో ఈ వీడియో మరింత అద్భుతంగా కనిపించింది.

ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోని దాదాపు 50 లక్షల మంది వీక్షించారు.మీరు ఒక లూక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube