వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. పై చేయి సాధించేది ఎవ‌రో..

ఇప్పుడు ఏపీలో వైసీపీ పార్టీ చాలా దూకుడు మీద ఉంది.ఆ పార్టీకి ఇప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షాలు పోటీ వ‌చ్చే స్థాయిలో లేవు.

 Mp Vs Mla In Ycp Someone Who Gets The Upper Hand, Ycp, Ap Politics, Ycp Mp Bhara-TeluguStop.com

కానీ ఇప్పుడు సొంత పార్టీలోనే ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎంపీలు అన్న‌ట్టు వ‌ర్గ పోరు న‌డుస్తోంది.జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం ఎమ్మెల్యేల‌కు ఎంపీల‌కు మొద‌టి నుంచి ఇదే విభేదాలు న‌డుస్తున్నాయి.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ విభేదాలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి.ఇక్క‌డ ఎంపీ మార్గాని భరత్ రామ్ కు అలాగే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అస్స‌లు ప‌డ‌ట్లేదు.

ఇద్ద‌రి మధ్య చాలా రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉంది.

ఇక ఇప్పుడు ప‌దువుల పందేరంలో మ‌రోసారి వీరి విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి.

రాజమండ్రి సిటీతో పాటు రూరల్ నియోజకవర్గాల‌కు వైసీపీ పార్టీ కన్వీనర్లుగా చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే రాజా వ‌ర్గీయులు మాత్ర‌మే ఉంటున్నారు.కాగా ఈ ప‌దవుల‌ను త‌మ వర్గానికి చెందిన నేతలే ఉండాల‌ని ఎంపీ భరత్ రామ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇందుకోసం అగ్ర నేత‌ల అండ‌తో రెండు నియోజకవర్గాల్లో కూడా త‌న వ‌ర్గీయుల‌కు ఇప్పించుకుని చ‌క్రం తిప్పేశారు.దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో భరత్ రామ్ ఎమ్మెల్యే జ‌క్కంపూడి మీద పైచేయి సాధించినట్టు అయ్యింది.

Telugu Ap, Jagan, Ycpmla, Ycp-Telugu Political News

అయితే ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యే రాజాకు ఎప్ప‌టి నుంచో ఉన్న‌టువంటి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా పోవ‌డం పెను సంచ‌ల‌న‌మే రేపింది.అయితే దీన్ని కూడా ఎమ్మెల్యే వ‌ర్గీయులు పాజిటివ్‌గానే ప్ర‌మోట్ చేసుకున్నారు.అదేంటంటే త‌మ ఎమ్మెల్యేకు త్వ‌ర‌లోనే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని, అందుకే తప్పించార‌ని అంటున్నారు.ఇక ఇదే క్ర‌మంలో భ‌ర‌త్ రామ్‌కు ఎమ్మెల్యే వ‌ర్గీయులు ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్‌లు ఇస్తుండ‌టం సంచ‌ల‌నం రేపుతోంది.

రాజా ఫ్యామిలీని ఎంపీ భ‌ర‌త్ రామ్ ఏ మాత్రం విమర్శించినా ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు.మ‌రి భ‌ర‌త్ ఎలా స్పందిస్తారో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube