కన్నడ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఉపేంద్ర హీరోగా ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది.
ఈ విషయాన్ని ఆర్జీవి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఉపేంద్రకు బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవి త్వరలో ఆయనతో ఒక మాస్ అండ్ కమర్షియల్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
కన్నడ స్టార్ ఉపేంద్రకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
ఈమధ్య ఆయన తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఉపేంద్ర సరైన ఛాన్స్ వస్తే లీడ్ రోల్ కూడా చేయాలని చూస్తున్నాడు.
ఉపేంద్ర హీరోగా ఆర్జీవి డైరక్షన్ లో సినిమా అంటే ఇద్దరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందా అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.తప్పకుండా ఉపేంద్రతో వర్మ ఒక సంచలన సినిమానే చేస్తాడని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.