ఆ సినిమాతో కోట్ల రూపాయలు నష్టపోయా.. మురళీమోహన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా గుర్తింపును సొంతం చేసుకున్న మురళీమోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా నటించడం లేదనే విషయం తెలిసిందే.పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు అనే గ్రామంలో జన్మించిన మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు.

 Actor Murali Mohan Comments About Iddaru Movie, Actor , Murali Mohan , Tollywood-TeluguStop.com

నాటకాలతో కెరీర్ ను మొదలుపెట్టిన మురళీమోహన్ తర్వాత రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త కావాలని కోరికని విజయవాడలో బిజినెస్ తో కెరీర్ ను మొదలుపెట్టానని మురళీమోహన్ అన్నారు.

బిజినెస్ పై దృష్టి పెట్టడంతో డిగ్రీ కూడా చేయలేదని మురళీమోహన్ అన్నారు.మొదట వర్కింగ్ పార్ట్ నర్ గా ఒక కంపెనీలో చేరి 50% షేర్ హోల్డర్ అయ్యానని మురళీమోహన్ అన్నారు.

హీరో అంటే అవకాశాలు రావని కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేశానని మురళీమోహన్ తెలిపారు.

Telugu Dasari Yana Rao, Iddaru, Manirathanam, Maniratnam, Muralimohan-Movie

దాసరి నారాయణరావు తనను పైకి వస్తానని మాట ఇచ్చి తనకు సినిమా ఆఫర్లు ఇచ్చారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.సినిమాల్లోకి తాను లేట్ గా ఎంట్రీ ఇచ్చానని సినిమాల్లోకి వచ్చే సమయానికి పెళ్లై పిల్లలున్నారని మురళీమోహన్ వెల్లడించారు.రోజుకు రెండు షిప్టులలో పని చేశానని కొన్ని సినిమాల హక్కులు కొనేవాడినని మురళీమోహన్ తెలిపారు.

మణిరత్నం ఇద్దరు అనే సినిమా హక్కులు తీసుకున్నామని సినిమా డిజాస్టర్ అయిందని తెలిపారు.

Telugu Dasari Yana Rao, Iddaru, Manirathanam, Maniratnam, Muralimohan-Movie

అప్పటివరకు సంపాదించిన మొత్తం ఆ సినిమాతో పోయిందని అదృష్టం కలిసిరాక ఫెయిల్ అయిందని అనిపించిందని మురళీమోహన్ అన్నారు.జయభేరి బ్యానర్ గిరిబాబు గారిదని ఆయన నుంచి ఆ బ్యానర్ తీసుకున్నామని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.అతడు సినిమా నిర్మాతగా చివరి సినిమా అని మురళీ మోహన్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిర్మాణానికి దూరం కావాల్సి వచ్చిందని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లెవెల్ కు వచ్చిందని మురళీమోహన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube