అత‌నికే టీ20 కెప్టెన్సీ ఇవ్వాలంటున్న గ‌వాస్క‌ర్‌.. రోహిత్ వ‌ద్ద‌ట‌..

మ‌న ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక‌పోతే అన్ని ఫార్మాట్ల‌కు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ అన‌నూహ్యంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

 Gavaskar Wants To Give Him T20 Captaincy At Rohit , Gavaskar, Rahul , Rishat P-TeluguStop.com

త‌న టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.మూడు ఫార్మాట్ల‌లో కెప్టెన్సీ చేయాలంటే వ‌ర్క్ బ‌ర్డెన్ ఎక్కువ‌వుతోంద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపాడు.

దీంఓ మాజీ క్రికెటర్లు ఇప్పుడు టీ20 జట్టుకు ఎవ‌రు కెప్టెన్‌గా సత్తా చాటుతారో అనే చాలామంది అభిప్రాయాలను సేక‌రిస్తున్నారు.ఇక మ‌రీ ముఖ్యంగా రోహిత్ శర్మ పేరు బ‌లంగా వినిపిస్తోంద‌ని చెప్పాలి.

ఇక ఆయ‌న త‌ర్వాత రిషత్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్యర్ లాంటియ యంగ్ స్ట‌ర్ల పేర్లను బీసీసీఐ ప‌రిశీలిస్తోంది.కాగా చాలా మంది రోహిత్ పేరునే చెప్తున్నారు.

ఎందుకంటే ఐపీఎల్‌లో అత‌నికి ఉన్న ట్రాక్ రికార్డును చూసి అత‌ను అయితేనే బాగుంటుంద‌ని, పైగా అత‌ను ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నందున ఆయ‌న‌కు ఇవ్వాల‌ని కోరుతున్నారు.ఇక ఇందులో భాగంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ త‌న వంతుగా కెప్టెన్ పై అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

అయితే ఆయ‌న రోహిత్ పేరును కాకుండా కేఎల్ రాహుల్ పేరును బ‌ల‌ప‌ర్చారు.

ఆయ‌న‌కు కెప్టెన్సీ లక్షణాలున్నాయని, కాబ‌ట్టి అత‌న్ని చేస్తేనే బాగుంటుంద‌న్నారు.

మొన్న ఇంగ్లాండ్‌ టూర్‌లో కూడా ఇండియా త‌ర‌ఫున ఆడిన‌న కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడ‌ని గవాస్కర్ గుర్తుచేశారు.దాంతో పాటు ఐపీఎల్ లో కూడా మంచి రికార్డు ఉంద‌ని, ఇక వ‌న్డే మ్యాచ్‌ల‌లో కూడా ఆయ‌న బాగా ఆడుతున్నారంటూ చెప్పారు గ‌వాస్క‌ర్‌.

అంతర్జాతీయ స్టేడియంల‌లో రాహుల్ ఆటతీరు బాగుంది కాబ‌ట్టి ఆయ‌న‌కు ఇస్తే మంచిద‌ని గ‌వాస్క‌ర్ వివ‌రించారు.మ‌రి బీసీసీఐ ఎవ‌రిని నియ‌మిస్తుందో తెలియాలంటే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube