షారుఖ్ అత్లీ కాంబో మూవీ టైటిల్ ఇదేనా..!

కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అత్లీ తన నెక్స్ట్ సినిమా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని షారుఖ్ ఖాన్ సౌత్ డైరక్టర్ ను నమ్ముకోవాల్సి వచ్చింది.

 Sharukh Khan Atlee Combination Movie Title , Sharukh Khan , Atlee , Bollywoo-TeluguStop.com

వరుసగా విజయ్ తో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న అత్లీ షారుఖ్ తో అదిరిపోయే సినిమా చేస్తాడని తెలుస్తుంది.ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యుయల్ రోల్ చేస్తారని తెలుస్తుంది.

ఇక సినిమాకు టైటిల్ గా లయన్ అని పెట్టబోతున్నారని టాక్.

పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు అదే పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పుకుంటున్నారు.

ఆల్రెడీ బాలయ్య బాబు లయన్ టైటిల్ తో సినిమా చేశాడు.అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇక నేషనల్ వైడ్ గా షారుఖ్, అత్లీ కాంబో సినిమా లయన్ టైటిల్ తో వస్తుందని తెలుస్తుంది.కచ్చితంగా ఈ సినిమా అంచనాలను మించి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

మరి విజయ్ కు వరుస హిట్లు ఇస్తున్న డైరక్టర్ అత్లీ షారుఖ్ ఖాన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.ఈ సినిమాను హిందీతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రైట్ సినిమాలానే తెరేక్కించాలని చూస్తున్నారట.

తెలుగులో షారుఖ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube