యూఎస్: ఇండో- అమెరికన్ కమ్యూనిటీకి కేంద్రంగా హ్యూస్టన్ నగరం.. విశ్లేషణ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.

 Houston, The New And Thriving Hub Of Indian-american Community , Us Federal Emer-TeluguStop.com

తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.

అన్ని రకాలుగా ప్రోత్సహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.

సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.

ఇందుకు ఎన్నో ఉదాహరణలు.భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.

ఇక భారతీయులను అమెరికన్లు ఎంతగానో ప్రేమిస్తారు.కష్టాల్లో వున్న మనవారిని ఎందరో ఆదుకున్నారు.

మన భారతీయ పద్ధతులను, సంస్కృతులను అమెరికన్లు బాగా పాటిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికన్లు, భారతీయుల మధ్య అనుబంధం దృఢ పడుతోంది.

ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎన్నో రంగాల్లో భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో భారత సంతతి ప్రజలు ఉన్నప్పటికీ.కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్యలో స్థిరపడ్డారు.

అయితే గడిచిన కొన్నేళ్ల నుంచి హ్యూస్టన్ నగరం ఇండో అమెరికన్ కమ్యూనిటీకి కేంద్రంగా అవతరిస్తోంది.

యూఎస్ సెన్సస్ బ్యూరో లెక్కల ప్రకారం ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ వలసదారులు 2.7 మిలియన్ల మంది వుంటే.అత్యధికంగా కాలిఫోర్నియాలో 20 శాతం ఎక్కువగా వున్నారు.

ఆ తర్వాత టెక్సాస్, న్యూజెర్సీలు వున్నాయి.టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో దాదాపు 1,50,000 మంది భారతీయులు వున్నట్లు అంచనా.

హ్యూస్టన్‌లో భారత సంతతి ప్రజల్లో వైద్యులు, దంత వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఐటి నిపుణులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో వున్నారు.

సామాజిక సేవ విషయంలోనూ భారతీయులు ముందుంటున్నారు.2017లో చోటుచేసుకున్న హరికేన్ హర్వే సమయంలో దాతృత్వం చూపారు.దాదాపు 1250 మందికి పైగా వాలంటీర్లు 687 మందిని వరదల నుంచి రక్షించారు.30000 వేల మందికి భోజనం అందజేశారు.వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ధ్వంసమైన గృహాలను పునర్నిర్మించడంలోనూ ఇండియన్ కమ్యూనిటీ పాలుపంచుకుంది.

ఇక కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో తన ఉదారతను చాటుకున్నారు భారతీయులు.మాస్క్‌లు, పీపీఈ కిట్లు, ఆహారాన్ని పంపిణీ చేశారు.ఇప్పుడు కూడా సేవా ఇంటర్నేషనల్ వాలంటర్లు యూఎస్ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ఫెమా)కి కోవిడ్ టీకా ప్రయత్నాలలో సహాయం చేస్తున్నారు.

ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న హ్యూస్టన్‌లోని ఇతర సంస్థలలో ఏకల్ విద్యాలయ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ యూఎస్ఏ, ఇండియా హౌస్, ఇండియా కల్చర్ సెంటర్ మరియు హ్యూస్టన్ గుజరాతీ సమాజ్ ఉన్నాయి.

గ్రేటర్ హౌస్టన్ ఇండో-అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కమ్యూనిటీ భారతీయుల గొంతుకగా వ్యవహరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube