సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెలుగులోనూ ఉన్నాయి తెలుసా?

సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే మనకు హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి.అక్కడి సినిమా తెరపై సైన్స్ ప్రయోగాలు ఎన్నో కళ్లకు కట్టినట్లు చూపించారు కూడా.

 Science Fiction Movies In Tollywood Movies, Science Fiction Movie, Tollywood, Te-TeluguStop.com

అయితే తెలుగులోనూ ఇలాంటివి పలు సినిమాలు వచ్చాయి.అందులో ముఖ్యంగా చెప్పుకునేది.

ఆదిత్య 369 సినిమా.ఈ ఒక్క సినిమానే కాదు.

అంతకు ముందు కూడా పలు సినిమాలు వచ్చాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తెలుగు సినిమా పరిశ్రమలో 1969లో శభాష్‌ సత్యం అనే సినిమా వచ్చింది.కృష్ణ, రాజశ్రీ నటీనటులుగా చేశారు.హీరో .శాస్త్రవేత్త అయిన తన మేనమామ ప్రభాకర్ రెడ్డి కనిపెట్టిన ఓ లిక్విడ్ తాగుతాడు.దీంతో అతడు తన రూపం కనిపించకుండా తిరుగుతాడు.ఈ విషయం తెలిసిన కైకాల సత్యనారాయణ.ఓ క్రైమ్ చేసిన ఆ నేరాన్ని సత్యం మీదకు నెట్టేస్తాడు.చివరకు అదే సైంటిస్ట్ తయారు చేసిన మరో ద్రావణాన్ని తాడి మళ్లీ తన రూపాన్ని తెచ్చుకుంటాడు.నేరస్తుడిని చట్టానికి పట్టిస్తాడు.

1965లో తెలుగులో ఇలాంటి సినిమానే మరోటి వచ్చింది.దాని పేరు దొరికితే దొంగలు.ఇందులో హీరో, హీరోయిన్లుగా ఎన్టీఆర్, జమున నటించారు.హీరోయిన్ తండ్రి రకరకాల పసర్లతో రకరకాల ప్రయోగాలు చేస్తాడు.

Telugu Aditya, Balakrishna, Jamuna, Mayabazar, Science, Shabash Satyam, Telugu S

అనుకోకుండా ఓ రకం పసరు కాలికి పూసుకుంటే గాల్లోకి ఎగురుతారు.అటు 1957లో వచ్చిన మాయాబజారు సినిమాను కూడా సైన్స్ ఫిక్షన్ సినిమాగానే చెప్పుకోవచ్చు.1981లో హాలీవుడ్‌ లో ఇండీయానా జోన్స్‌ అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలోనే చాలా సీన్స్ 1967లోనే విఠలాచార్య చిక్కడు దొరకడు మూవీలో చేసిన సీన్లే ఉండటం విశేషం.హాలీవుడ్ లోనే కాదు.తెలుగులోనూ పలు సైన్స్ సినిమాలు వచ్చాయి.కానీ మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే హాలీవుడ్ అనే భ్రమలో ఉండిపోయాము.

అయినా తెలుగులో వచ్చిన పలు ఇలాంటి సినిమాలు జనాలను బాగానే ఆకట్టుకున్నాయి.సినీ క్రిటిక్స్ కూడా దర్శకుల ఆలోచనలను ఎంతో మెచ్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube