స్కూల్ పిల్లల అకౌంట్ లో 900 కోట్లు.. క్లారిటీ ఇచ్చిన బ్యాంక్ అధికారులు!

నిన్నటి నుండి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.స్కూల్ కు వెళ్లే పిల్లల ఖాతాలో 900 కోట్ల నగదు జమ అయ్యాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 No Money Transferred: Dm After 2 Bihar Boys' Bank Statements Show ₹900 Cr In A-TeluguStop.com

ఎవ్వరి నోటా విన్నా ఇదే మాట వినపడింది.అసలు స్కూల్ కు వెళ్లే పిల్లల ఖాతాలో అంత డబ్బు ఎలా క్రెడిట్ అవుతుంది అనే సందేహం అందరికి వచ్చింది.

ఇలా వైరల్ అవుతున్న న్యూస్ పై బ్యాంక్ అధికారులు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు.

చదువుకునే పిల్లలకు అకౌంట్ ఉండడమే గొప్ప విషయం.

అలాంటిది ఇలా పిల్లల ఖాతాలో 900 కోట్లు ఎవరు వేశారు అనే విషయంపై చర్చ జరిగింది.ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

స్కూల్ కు వెళ్లే ఇద్దరు పిల్లల అకౌంట్ లో 900 కోట్లు క్రెడిట్ అయ్యాయని బ్యాంక్ స్టేట్మెంట్స్ రావడంతో బ్యాంక్ అధికారులు కూడా ఆశ్చర్య పోయారు.ఈ విషయం ఉన్నత అధికారులు దృష్టికి తీసుకు వెళ్లారు .

ఈ విషయంపై విచారం జరిపిన ఉన్నత అధికారులు ఇలా 900 కోట్లు క్రెడిట్ అయ్యాయని స్టేట్ మెంట్స్ ఎందుకు వచ్చాయో వివరణ ఇచ్చారు.సాంకేతిక లోపం వల్ల ఇలా స్టేట్ మెంట్ లో 900 కోట్లు జమ అయినట్టు వచ్చాయని కానీ అకౌంట్ లో 900 కోట్లు క్రెడిట్ అవ్వలేదని బ్యాంక్ అధికారులు క్లారిటీ ఇచ్చారు.ఇదంతా కూడా బీహార్ లో జరిగింది.

గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థుల అకౌంట్ లోకి 900 కోట్ల డబ్బు క్రెడిట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.ఈ విషయంపై బీహార్ గ్రామీణ బ్యాంక్ కతియార్ డిఎం ఉదయన్ మిశ్రా మాట్లాడుతూ ఏ ప్రభుత్వం డబ్బు జమ చేయలేదని సాంకేతిక లోపం వల్లనే అలా జరిగిందని తెలిపారు.ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించామని ఆయన స్పేటం చేసారు.

మొత్తానికి వల్ల నిన్నటి నుండి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

https://twitter.com/ANI/status/1438473309323210752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438473309323210752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fnational%2Fno-money-transferred-dm-after-2-bihar-boys-bank-statements-show-rs-900-crore-in-accounts-277136.html

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube