నిరుద్యోగ విషయంలో జగన్ పై మండిపడ్డ చంద్రబాబు..!!

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగ శాతం మూడు నుండి 16 శాతానికి పెరిగిపోయిందని చంద్రబాబు ఆరోపణలు చేశారు.మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో యువజన విద్యార్థి సంఘ నేతలతో ఇటీవల చంద్రబాబు సమావేశం అయ్యారు.

 Chandrababu Angry With Jagan Over Unemployment Chandrababu, Jagan .,chandrababu-TeluguStop.com

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమలు.చాలా ఉద్యోగాలు కూడా పోయాయి అని పేర్కొన్నారు.

రాజధాని అమరావతి విషయంలో గందరగోళం సృష్టించడంతో పరిశ్రమలు పెట్టుబడులు వెనక్కి వెళ్లి పోయాయి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అధికారంలో ఉన్న టైంలో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని అవి గనుక వచ్చి ఉంటే దాదాపు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేది అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అంతా బూటకమని.ఈ క్రమంలో ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది అని మండిపడ్డారు.

అదే విధంగా ఉద్యోగం కోసం పోరాడే.విద్యార్థి సంఘాలకు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని.

సమావేశంలో చంద్రబాబు యువజన సంఘం నాయకులకు స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube