ఆ బడా బిజినెస్ మ్యాన్‌తో ప్రణీతకు బలవంతంగా పెళ్లి జరిగిందా.. అందుకే దూరం?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రణీత గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 South Star Heroine Pranitha Marriage Gossips On Internet,  Pranitha Marrige, Her-TeluguStop.com

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో కూడా నటించింది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే ప్రణీత పెళ్లి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి మంచి సక్సెస్ లు అందుకుంది.

అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనేంటో నిరూపించుకుంది.గత ఏడాది కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.ఇక బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ ఏడాది మేలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

దీంతో ఆ సమయంలో తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.తాను పెళ్లి చేసుకున్న విషయం అప్పుడు బయట పడింది.

Telugu Kollywood, Pranith Gossips, Pranithanithin, Pranitha, Subhash, Tollywood-

ఇక కొన్ని రోజులకు తన పెళ్లి గురించి స్పందించగా.తమది ప్రేమ పెళ్లి అని ఇంట్లో చెప్పగానే ఒప్పుకున్నారని తెలిపింది.ఇక కొన్ని వ్యక్తిగత విషయాలను ఎక్కువగా చెప్పుకోవడం ఇష్టం ఉండదని కూడా తెలిపింది.ఇక ఇప్పటి వరకు ఎటువంటి గాసిప్ లకు కూడా లొంగని ప్రణీత ఈ మధ్య బాగా గాసిప్ లను ఎదుర్కొంటుంది.

పెళ్లి సమయంలో కూడా పెళ్లి ఫోటోలు లీక్ అవడంతో కొన్ని కాంట్రవర్సీలు కూడా ఎదుర్కొంది.ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందని.

అంతేకాకుండా పెళ్లి కొడుకు కూడా అంత అందంగా లేడని కూడా కామెంట్లు ఎదుర్కొంది.

Telugu Kollywood, Pranith Gossips, Pranithanithin, Pranitha, Subhash, Tollywood-

ఇదిలా ఉంటే ఈ మధ్య ప్రణీత గురించి మళ్ళీ కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.కానీ ఇప్పటివరకు తన భర్తతో దిగిన ఫోటోలను ఒక్కటి కూడా పంచుకోలేదు.

దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.పెళ్లయి ఇన్ని నెలలు గడిచినా కూడా ప్రణీత తన భర్త తో దిగిన ఫోటోలు ఎందుకు పంపించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు.ఇంతకీ ప్రణీత తన భర్తతోనే ఉందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కొందరు ఈ పెళ్లి మీకు ఇష్టం లేకుండా జరిగిందా.ఇంట్లో వాళ్లు ఏమైనా అతడితో బలవంతంగా పెళ్లి చేశారా అందుకే సోషల్ మీడియాలో అతనితో దిగిన ఫోటోలను పంచుకోవడం లేదా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరి అభిమానుల అడుగుతున్న ప్రశ్నలకు ప్రణీత ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube