సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఏకంగా ఈరోజు ఏడు సినిమాలు రిలీజ్?

ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గిపోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్నారు.తెలంగాణలో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక ఆట తక్కువగా వేస్తున్నారు.

 Nithin Maestro To Vijay Sethupathi Annabelle Total Seven Movies Going To Stream-TeluguStop.com

ఇలాంటి సిచ్యువేషన్ లో కొన్ని సినిమాల నిర్మాతలు రిస్క్ చేసి థియేటర్లలో విడుదల చేస్తోంటే… మరికొందరు మాత్రం నేరుగా ఒటీటీలలో రిలీజ్ చేస్తున్నారు.జనం అంతా ఇళ్లకే పరిమితవుతున్న ప్రస్తుత రోజుల్లో ఇప్పుడు చాలా సినిమాలు ఓటిటిలో రిలీజ్ కానున్నాయి.కాగా… ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే కొన్ని ఆసక్తికర సినిమాల విషయానికి వస్తే దాదాపుగా ఈ వారం ఐదు సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయినట్టు తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే ఆరు సినిమాలు ఒక వెబ్ సిరీస్ విడుదలయ్యాయి.

అందులో భాగంగా నితిన్ హీరోగా వస్తున్న మాస్ట్రో ప్రధానమైనది.ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్-టు-ఒటీటీ విడుదల కాబోతోంది.

ఇవే కాక మరో చిత్రం ప్రియురాలు కూడా సోనీలైవ్‌లో నేరుగా స్ట్రీమ్ కాబోతోంది.డిస్నీ + హాట్‌స్టార్‌లో అన్ హెర్డ్ అనే ఒక కొత్త వెబ్ సిరీస్ యొక్క సీజన్ 1 కూడా ఈరోజు నుంచే స్ట్రీమ్ కాబోతోంది.

తమిళ చిత్రం అనబెల్‌ సేతుపతి (హాట్‌స్టార్‌లో) మరియు హిందీ చిత్రం అంకహి కహనియా (నెట్‌ఫ్లిక్స్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లు కూడా ఈరోజే విడుదలవుతున్నాయి.గత నెలలో థియేటర్లలో విడుదలైన సునీల్ కనబడుటలేదు మరియు సుశాంత్ యొక్క ‘ఇచ్చట వాహనాలు నిలువ రాదు‘ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఆ సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా.

యువ హీరో నితిన్ మాస్ట్రో అనే థ్రిల్లర్‌లో నటించిన సంగతి తెలిసిందే.కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ చిత్రం ఈ రోజు నుంచి హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ తెరకెక్కించారు.

Telugu Ankahi Kahaniya, Maestro, Nithin, Ott, Priyuralu, Tollywood, Unheard-Movi

ఇక పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ప్రియురాలు‘.రామరాజు సినిమా బ్యానర్ మీద రామరాజు, అజయ్ కర్లపూడి ఈ సినిమాని నిర్మించారు.నిర్మాణ బాధ్యతలు చూస్తూనే ‘ప్రియురాలు‘ చిత్రానికి దర్శకత్వం వహించారు రామారాజు.దీనికి సంబంధించిన ట్రైలర్.సినిమాపై ఆసక్తిని పెంచింది.ఎక్స్‌‌ట్రా మారిటర్ అఫైర్స్, ఎక్స్‌‌ట్రా మారిటల్ లవ్ అని చెబుతూ ట్రైలర్ లో ఆసక్తి రేపిన ఈ సినిమా సోని లివ్‌‌ ఓటీటీలో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అయ్యింది.

Telugu Ankahi Kahaniya, Maestro, Nithin, Ott, Priyuralu, Tollywood, Unheard-Movi

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సామాన్యుడి దృక్పథాన్ని ఆవిష్కరించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొట్టమొదటి తెలుగు స్పెషల్ ఈ ‘అన్‌హెర్డ్‘.స్పెషల్ సంభాషణలను కలిగిన ఈ సిరీస్ ఈ రోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీం అయ్యింది.ఆదిత్య కె.వి రచించి, దర్శకత్వం వహించిన ఈ అన్‌హెర్డ్‌ను ఎల్లనార్ ఫిల్మ్స్‌కు చెందిన రాధిక లావు నిర్మించారు.బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం భారతదేశ పోరాటంలో పుట్టుకొచ్చిన సిద్ధాంతాల చుట్టూ హైదరాబాద్ నగరం మార్పుకు కేంద్రంగా ఎలా మారిందో ఈ సీరీస్ లో చూపించారు.ఈ సీరీస్ లో శ్రీనివాస్ అవసరాల, బాలాదిత్య, చాందిని చౌదరి, ప్రియదర్శి మరియు అజయ్‌ లాంటి టాలెంటెడ్ నటులు ఉన్నారు.

Telugu Ankahi Kahaniya, Maestro, Nithin, Ott, Priyuralu, Tollywood, Unheard-Movi

దీంతో పాటు…విజయ్‌ సేతుపతి, తాప్సీ కలిసి నటించిన హారర్‌ కామెడీ ‘అనబెల్‌ సేతుపతి‘.ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు మొత్తం 5 భాషల్లో తెరకెక్కింది.డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.రాజమహల్‌ చుట్టూ తిరిగే హారర్‌ కామెడీ కధలు మనకు కొత్త కాదు.అలాంటి కథతోనే మన ముందుకు వచ్చారు.ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్రసాద్‌, జగతిబాబు, సురేఖవాణిలు కీలకపాత్రల్లో నటించారు.

హిందీ చిత్రం అంకహి కహనియా (నెట్‌ఫ్లిక్స్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.

Telugu Ankahi Kahaniya, Maestro, Nithin, Ott, Priyuralu, Tollywood, Unheard-Movi

సునీల్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం `క‌న‌బ‌డుట‌లేదు`.ఓ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎమ్‌.బాలరాజు దర్శకత్వం వహించగా కొన్నాళ్ళ క్రితం థియేటర్లో రిలీజ్ అయింది.

ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు.ఈ క్రమంలో ఇవి కూడా ఓటీటీలో స్ట్రీం అయ్యాయి.

వర్మకు చెందిన స్పార్క్ ఒటీటీలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.సుశాంత్ అక్కినేని హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనులు నిలుప రాదు‘ సినిమా ఆహా లో అందుబాటులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube