లహరి, మానస్ మిడ్ నైట్ రొమాన్స్.. బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు ఇంకా ఎన్నో?

అక్కినేని నాగార్జున అన్నట్టుగా బుల్లితెర ప్రేక్షకులకు 5మచ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.చూస్తుండగానే.

 Maanas And Lahari Midnight Romance In Bigg Boss Season 5 September 16-episode 12-TeluguStop.com

రెండో వారం వచ్చేసింది.ఒకరు ఇంతకుముందే ఆట నుంచి ఎలిమినేట్ కాగా ఇప్పుడు రెండో ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది.

రోజులు గడిచే కొద్దీ టాస్క్ ల పరిమితి సీరియస్ నెస్ ఎక్కువవుతున్నాయి.అంతే ఛాలెంజింగ్ గా తీసుకొని ఇంటి సభ్యులు పోటీ పడుతున్నారు.

ఇక తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రెండు టీంలకు అగ్గిపుల్లలు ఇచ్చి ఇసుకలో వరుసగా గుచ్చి వెలిగించాలని చివరి వరకూ పుల్లలు ఆరిపోకుండా ఎవరివైతే వెలుగుతాయో ఆ టీం గెలిచినట్టు అని చెప్పారు.బిగ్ బాస్.

అయితే ఈ టాస్క్‌లో ఎల్లో టీంపై బ్లూ టీం గెలిచింది.అనంతరం శ్వేతా బర్త్ డే కావడంతో హమీదా, కాజల్‌లు కేట్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు.

మొత్తంగా ఈ పంతం నీదా నాదా టాస్క్‌లో ఈగల్ ( బ్లూ) టీం దగ్గర ఎక్కువ ఫ్లాగ్స్ ఉండటంతో విజేతలుగా నిలిచారు.అనంతరం శ్వేత బర్త్ డే కావడంతో ఇంటి సభ్యులందరికీ చాక్లెట్స్ పంపించి సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్.

ఇక అర్ధరాత్రి పూట మానస్ పాత్రలు క్లీన్ చేస్తుండగా .అతని దగ్గరకు వచ్చింది లహరి.ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రావడంతో నీ ఫేవరేట్ కలర్ బ్లాక్‌నా అంటూ పులిహోర కలపడం మొదలుపెట్టాడు మానస్.‘అవును నాకు బ్లాక్ అంటే ఇష్టం ఫస్ట్ బ్లాక్ తరువాత వైట్.

ఆ తరువాత బ్లూ అని సమాధానం ఇచ్చింది లహరి.

Telugu Bigg Boss, Lahari, Manas, Reality Show, Romance-Movie

బ్లూ నా ఫేవరేట్ కలర్ అని చెప్పాడు మానస్.అయితే వీళ్లిద్దరూ కిచెన్‌లో ఒంటిరిగా మాట్లాడుకుంటుండగా.శ్రీరామ్, సిరి, ప్రియ మరియు మిగతా బ్యాచ్ వీళ్లని గమనిస్తూ ఉన్నారు.

శ్రీరామ్ వీళ్లని అదే పనిగా చూడటంతో.అది అద్దంలో గమనించిన మానస్ హో లుక్‌లు ఇస్తున్నావా? అని లహరికి వినిపించేట్టుగా అన్నాడు.నేను ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉన్నా వస్తాను ఎందుకంటే ఈ టైంలో ఒక్కరు చేయాలంటే చిరాకుగా అనిపిస్తుంది అని చెప్పింది లహరి.

Telugu Bigg Boss, Lahari, Manas, Reality Show, Romance-Movie

అయితే వీళ్లు మాట్లాడుకుంటుంగా.శ్రీరామ్ వీళ్ల దగ్గరకు వచ్చేశాడు.దీంతో మానస్ శ్రీరామ్‌ని మరింత ఉడికించడానికి ‘ఏంటి లహరి పడుకుంటున్నావా? అని అడిగి ఓకే గుడ్ నైట్ అని దగ్గరకు తీసుకుని హగ్ ఇచ్చాడు.అది చూసి శ్రీరామ్ పక్కకి వెళ్లిపోయాడు.ఆ తరువాత లహరి నా బెడ్ వరకూ రా అని మానస్‌ని పిలిచింది.మానస్ ఆమె వెనుకే వెళ్లడంతో మైక్ తీసేసిన లహరి మానస్‌ని గట్టిగా కౌగిలించుకుంది.మానస్ కూడా లహరిని హగ్ చేసుకొని.

గుడ్ నైట్ చెప్పాడు.మానస్ పని చేస్తుంటే అతనికి లహరి హెల్ప్ చేయడం.

తన బెడ్ దగ్గరకు పిలిపించుకుని మరీ హగ్ ఇవ్వడాన్ని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు.అయితే ఇదంతా శ్రీరామ్‌ని ఏడిపించడానికే చేశారా.? లేక బిగ్ బాస్ ఏదైనా కొత్త ట్రాక్‌కి ప్లాన్ చేశారా అన్నది ముందు ముందు తేలనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube