బిగ్ బాస్ హౌస్ అన్యాయం చేసిందంటూ సరయు కన్నీళ్లు.. కానీ ఏం లాభం?

ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టి… ఏదో చెద్ధామనుకొని… చివరికి ఇంకేదో అయ్యింది అన్నట్టుగా ఉంది 7 ఆర్ట్స్ సరయు పరిస్థితి.బిగ్ బాస్‌నే దమ్ దమ్ చేస్తానన్న ఆమె .

 Bigg Boss 5 Eliminated Contestant Sarayu Shocking Allegations On Bigg Boss Show-TeluguStop.com

వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది.బిగ్ బాస్ ఆడించిన ఆటలో గెలవలేక చివరికి బయటకి వచ్చేసింది సరయు.

దీంతో ఈ ఆటలో గెలవాలంటే కంటెస్టెంట్స్‌ని గెలవడం కాదు బిగ్ బాస్‌ని గెలవాలి… అని మరోసారి ఋజువైంది.

గత వారం నాగార్జున కట్ సెట్‌ అనే గేమ్ లో తమకి ఇష్టమైన వాళ్ల గురించి గొప్పగా చెప్పి బ్యాండ్ తొడగాలని కట్ అనుకున్నవాళ్ల ఫొటో చింపేయాలని చెప్పినప్పుడు హమీదా సరయు గురించి మంచిగా మాట్లాడి ఆమెతో సెట్ అనుకుని ఫ్రెండ్ షిఫ్ బ్యాండ్ తొడిగింది.

అయితే ఆ సీన్ సరయుకి పాజిటివ్‌గా ఉండటంతో అది టెలికాస్ట్ చేయకుండా లేపేశారు.అయితే సరయు తిడుతూ ఆమె గురించి నెగిటివ్‌గా మాట్లాడుతూ ఫొటోలను చింపేసినవి మాత్రం మిస్ చేయకుండా టెలికాస్ట్ చేశారు.

దీన్ని బట్టి .సరయుని బయటకు పంపడానికి బిగ్ బాస్ ముందే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.అంతేకాదు సిగరెట్ తాగడం అనేది మగాళ్లతో పాటు చాలామంది ఆడాళ్లకి ఉన్న అలవాటు ఉంటుంది.అలా చూస్తే సీజన్ 1లో ముమైత్ ఖాన్ కూడా తాగింది కదా…

అయితే ఆడవాళ్లు సిగరెట్ తాగడం అనేది మన తెలుగు ఆడియన్స్‌ తప్పుగానే భావిస్తారు.

దాన్ని బేస్ చేసుకున్న బిగ్ బాస్… ఫుటేజ్‌లో సరయు సిగరెట్ తాగున్నది మాత్రమే టెలికాస్ట్ చేశారు.

Telugu Bigg Boss, Biggboss, Hameeda, Lobo, Sarayu, Sarayualleged, Sarayu Cried,

హమీదా, లోబో, సరయు ముగ్గురూ కలిసి దమ్ము కొడుతున్న ఫుటేజ్‌ని హాట్ స్టార్‌లో టెలికాస్ట్ చేశారు కానీ.టీవీలలో మాత్రం కేవలం సరయు సిగరెట్ తాగుతున్నది మాత్రమే ప్లే అయ్యింది.ఒక అమ్మాయి సిగరెట్ తాగడం ఏంటి? అని జనం అనుకునేలా చేసి… సరయని బయటకు పంపడమే బిగ్ బాస్ ఉద్దేశం అని ఇక్కడ క్లియర్‌గా అర్థం అవుతోంది.

ఇదే విషయాన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు ఆవేదన వ్యక్తం చేసింది.‘బిగ్ బాస్‌కి నేను అంటే ఎందుకు అంత వివక్షనో నాకు తెలియలేదు.

నాకు పాజిటివ్‌గా అనిపించినవి ఏవీ టెలికాస్ట్ చేయలేదు.కేవలం నన్ను ఎక్కడైతే జనం తిట్టుకుంటారో దాన్నే చూపించారని ఆమె వాపోయారు.

ఇందులో జనం తప్పుకూడా లేదు.షణ్ముఖ్‌తో నేను గొడవ పడింది మాత్రమే చూపించారు .గొడవలకు కారణమైన ఫుటేజ్‌ని టెలికాస్ట్ చేయలేదు.మొదటి రెండు రోజులు చాలా ఎంటర్ టైన్ చేశాం.

వర్షంలో డాన్స్ చేశాం.అవన్నీ చూపించలేదు.

నాలాగా నేను ఉండాలనే అక్కడకు వెళ్లాను.కంటెంట్ క్రియేట్ చేసే రకం నేను కాదు.

గొడవ ఉంటేనే నేను గొడవ పడతా.కంటెంట్ కోసం నేను చేయనని సరయు అన్నారు.

Telugu Bigg Boss, Biggboss, Hameeda, Lobo, Sarayu, Sarayualleged, Sarayu Cried,

బూతులు మాట్లాడటం నాకు అలవాటు.కానీ అందరూ చూస్తారని తాను ఒక్క బూతు కూడా మాట్లాడలేదని … సిగరెట్ తాగానంటే దాని వల్ల తాను ఒక్కదాన్నే ఎఫెక్ట్ అవుతా అనుకున్నా.అందుకే తాగానని సరయు వివరించారు.కానీ బూతులు అలా కాదు.టీవీ చూసేవాళ్లు ఛీ అంటారు.“నేను చేసిన తప్పు ఏంటంటే హౌస్‌లో స్మోక్ చేయడం.అది చేసి ఉండకపోతే వేరేలా ఉండేదేమో.స్మోక్ చేస్తే ఇంత సీరియస్‌గా తీసుకుంటారని తెలియదు.నేను నార్మల్‌గా స్మోక్ చేయను.ఒత్తిడి ఎక్కువయ్యి స్మోక్ చేశా.

హమీదా.నేను.

లోబోలు కలిసి స్మోక్ చేసేవాళ్లం.అయితే కేవలం నేను స్మోక్ చేసింది మాత్రమే టీవీలో చూపించారు.

మరి ఎందుకు నా ఫుటేజ్ మాత్రమే చూపించారో అర్థం కాలేదు.కామెడీ చేయడం.

డాన్స్ చేయడం.ఎంటర్ టైన్ చేయడం.

రెండు మూడు గొడవలు అయితే వాటిని కూడా నేను సార్ట్ ఔట్ చేశా.కానీ అవేం చూపించలేదు” అని ఆమె తెలిపారు.

Telugu Bigg Boss, Biggboss, Hameeda, Lobo, Sarayu, Sarayualleged, Sarayu Cried,

బిగ్ బాస్ నాకు ఎందుకింత అన్యాయం చేశాడో తెలియదు.నేను ఈ సందర్భంగా బిగ్ బాస్‌కి ఒక్కటే చెప్తున్నా… నాపట్ల ఎందుకు అంత వివక్ష చూపించారో అర్థం కావడంలేదు.నాకు పాజిటివ్ అయ్యేవి చూపించకుండా నెగిటివ్ అయ్యేవి మాత్రమే చూపించారు.నన్ను ఒకలా మరొకర్ని మరోలా చూపించడం న్యాయం కాదు బిగ్ బాస్.మీ ఎడిటర్స్‌కి చెప్పండి.ఎప్పుడూ గొడవలే కాదు.

కాస్త ఎమోషన్స్ కూడా చూపించాలని.నాకు ఇంత అన్యాయంచేస్తారని అనుకోలేదు బిగ్ బాస్” … అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సరయు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube