సమంత నా ఫస్ట్ లవ్ అంటూ ఫోటోలు రిలీజ్ చేసిన కుర్రాడు .. జాలిపడిన అక్కినేని కోడలు..

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే అందరికీ ఎంతో అభిమానం ఉంటుంది.ఈ క్రమంలోనే చాలా మంది అభిమానం చూపిస్తే .

 Fan Love Towards Samantha, Samantha Name As Tattoo, Samantha Fan Tattoo, Samanth-TeluguStop.com

మరికొంతమంది సినిమా సెలబ్రిటీల పై ఎంతో ప్రేమను పెంచుకుంటారు.అయితే ఇలాంటి వారిలో అబ్బాయిలు ఎక్కువగా హీరోయిన్స్ అంటే ఎంతో ఇష్టపడేటమే కాకుండా ఆ హీరోయిన్ అంటే పడిచచ్చే అంత ప్రేమను మనసులో దాచుకుంటారు.

ఈ విధంగా వారిని ఎంతో అభిమానించే, ప్రేమించే హీరోయిన్ల కోసం కొన్ని సాహసాలను కూడా చేస్తుంటారు.తాజాగా అలాంటి సాహసమే ఓ కుర్రాడు చేస్తూ తనకు ఆ హీరోయిన్ అంటే ఎంత ఇష్టమో ఆ హీరోయిన్ పై ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోషల్ మీడియా వేదికగా పవన్ సమ్ము అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసిన యువకుడు ట్విట్టర్ ద్వారా తనకు సమంత అంటే ఎంత ఇష్టమో తనపై ఉన్న ప్రేమను ట్విట్టర్ ద్వారా వ్యక్త పరిచారు.

ఇలా సమంత పై ఉన్న ప్రేమతో ఆ కుర్రాడు తన చేతిపై సమ్ము అని పచ్చబొట్టు వేయించుకొని, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.సమ్మూ నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నువ్వే.

నీపై నాకున్న ప్రేమ అనంతం నీ మీద నా ప్రేమ.ఈ టాటూ శాశ్వతం అనే ట్యాగ్ లైన్ రాసి సమంతకు ట్యాగ్ చేశాడు.

ప్రస్తుతం ఈ కుర్రాడు సమంత పై చూపిన ప్రేమను, అతను పోస్ట్ చేసిన ఫోటోలను చూసి ఎంతోమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా సదరు కుర్రాడు ట్వీట్ పై సమంత స్పందిస్తూ.రీ ట్వీట్ చేయడం గమనార్హం.ఇది చూసిన సమంత అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతూ సమంత పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా, ఉండే ఈ జంటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అయితే ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకు అక్కినేని కుటుంబం స్పందించకపోవడంతో ప్రేక్షకులలో పెద్ద ఎత్తున అనుమానాలు తలెత్తుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube