వైర‌ల్‌.. ట్రాక్‌కు అడ్డంగా ప‌డుకుని రైళ్ల‌ను ఆపేసిన మొస‌లి..

ఈ మ‌ధ్య అడ‌వి జంతువులు చేస్తున్న ప‌నులు చూస్తుంటే నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది.అవి చేసే ప‌నులకు ఏకంగా కొన్ని పెద్ద పెద్ద‌ప‌నులే ఆగిపోతున్నాయి.

 Viral The Crocodile That Ran Across The Track And Stopped The Trains, Viral News-TeluguStop.com

ఇక మ్యాచ్ మ‌ధ్య‌లోకి కుక్క‌లు లేదంటే పిల్ల‌లు వ‌స్తే ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచులు కూడా ఆగిపోతున్న సంగ‌తి తెలిసిందే.కాగా ఇప్పుడు ఓ మొసలి ఏకంగా పట్టాలపైకి వ‌చ్చి అటు వెళ్తున్న రైళ్లను మొత్తం ఆపేసింది.

చిత్ర‌మైన ఘటన వడోదర-ముంబై రైల్వే ట్రాక్ మీద జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.దీంతో అధికారులు మొత్తం అల‌ర్ట్ అయిపోయారు.

దాన్ని త‌ప్పించేందుకు చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది.

మంగళవారం రోజు అనుకోకుండా ఈ రైల్వే పట్టాలకు అడ్డంగా గాయాల‌తో ఉన్న ఓ మొసలి వ‌చ్చింది.

ఇక దీని కార‌ణంగా ఆ ట్రాక్‌పై వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగిపోవాల్సి వ‌చ్చింది.ఇక ఈ రైలు వెళ్ల‌క‌పోవ‌డంతో మిగతా రైళ్లు కూడా దాదాపుగా 45 నిమిషాలు లేటుగా న‌డిచాయి.

ఇక ఆ మొస‌లిని తొల‌గించేందుకు భద్రతా సిబ్బంది వెంట‌నే రంగంలోకి దిగింది.చాలా ర‌కాల సహాయక చర్యలు చేపట్టిన త‌ర్వాత ఎంతో క‌ష్ట‌ప‌డి చివ‌ర‌కు ఆ బాయ‌ప‌డ్డ మొస‌లిని పక్కకు జ‌ర‌ప‌డంతో ఆగిపోయిన రైలు మ‌ళ్లీ స్టార్ట్ అయింది.

Telugu Crocodile, Crocodilestops, Trains Minutes, Vadodaramumbai-Latest News - T

మొస‌లి కర్జన్‌ రైల్వే స్టేషన్ కు ద‌గ్గ‌ర‌లో ఆ ట్రాక్ మీద‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.ఇక దాన్ని తొల‌గించేందుకు వన్యప్రాణుల కార్యకర్త హేమంత్‌ వద్వాన రావాల్సి వ‌చ్చింది.ఆయ‌న రాగానే ఆ గాయ‌ప‌డ్డ మొసలికి చికిత్స చేసిన త‌ర్వాత పట్టాలపై నుంచి ప‌క్క‌కు తీసుకెళ్లారు.ఇక ఆ త‌ర్వాత దాన్ని కిసాన్ రైలులో త‌ర‌లించారు.ఇక అత‌ను ఇంకొంచెం ఆలస్యంగా వెళ్లి ఉంటే మాత్రం ఆ మొసలి మ‌ర‌ణించేద‌ని చెప్పారు.కాగా ఆ మొస‌లి అక్క‌డ‌కు అస‌లు ఎలా వ‌చ్చిందో మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.

అయితే ఒక మొస‌లి వ‌ల్ల ఇలా రైళ్లు ఆగిపోవ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube