అథ్లెట్ నీరజ్ చోప్రా సోషల్ మీడియా విలువ అన్ని కోట్లా?

ప్రపంచవ్యాప్తంగా అతి గొప్ప క్రీడా వేదిక ఏదైనా ఉందంటే అది ఒలింపిక్స్ అనే చెప్పాలి.అటువంటి ఒలింపిక్స్ లో పోటీ పడటం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు.

 Athlete Neeraj Chopra Is Social Media Worth All Crores Athletes, Niraaj Chopra,-TeluguStop.com

కానీ కొందరికే దానిలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.తాజాగా టోక్యో 2020 ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి.

అందులో భారత్ తన సత్తా చాటింది.భారత్ తరపున నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు.

అందుకే ఈ మధ్యకాలంలో నీరజ్ చోప్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఆయన గురించి ఒలింపిక్స్ ముందు ఎవ్వరికీ అంతగా తెలీదు.

అయితే ఇప్పుడు పసిడి పతకం సాధించడంతో నీరజ్ చోప్రా హీరో అయ్యాడనే అనిపిస్తోంది.రోజురోజుకూ ఆయన పాపులారిటీ పెరుగుతూ వస్తోంది.

ఈయన ఫాలోయింగ్ తో అటు క్రికెటర్లను, సెలబ్రిటీలను డిజిటల్ మీడియాలో వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతున్నాడు.గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ ఫాలోయింగ్ లో బాగా పెరిగింది.

దీంతో నీరజ్ చోప్రా క్రికెటర్లను దాటి ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.

బయటే కాదు సోషల్, డిజిటల్ మీడియాల్లో కూడా నీరజ్ చోప్రా పేరు బాగా వినిపిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్ సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ప్రస్తావించిన అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డు నెలకొల్పాడు.ఒలింపిక్స్ స‌మ‌యంలో మొత్తం 14 ల‌క్ష‌ల మంది 29 ల‌క్ష‌ల‌సార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో నీర‌జ్ చోప్రా పేరును ప్రస్తావించారు.

Telugu Athletes, Niraaj Chopra, Ups-Latest News - Telugu

ఆన్‌లైన్‌లో నీరజ్ చోప్రా పేరు ప్రస్తావించిన రేటు 2055 శాతం పెరిగినట్లు యుగోవ్ స్పోర్ట్ అనే క‌న్స‌ల్టెన్సీ సర్వేలో తేలింది.ఒలింపిక్స్ పతకం గెలుపొందడంతో సోషల్, డిజిటల్ మీడియాలో నీరజ్ చోప్రా రీచ్ 41.2 కోట్లకు చేరడంతో ప్రస్తుతం ఆయన సోష‌ల్ మీడియా విలువ‌ రూ.428 కోట్ల‌కు పెరిగింది.నీరజ్ చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 45 లక్షలకు ఉండగా గోల్డ్ గెలిచిన తర్వాత ఫాలోవర్ల సంఖ్య 2297 రెట్లు పెరిగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube