ఇష్టం లేని పెళ్లిలో వధువు ఎలా ప్రవర్తించిందో చూస్తే షాకవుతారు..!

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి వేడుక అనేది ఒక మధురమైన ఘట్టం.పెళ్లి చేసుకుంటున్న సమయంలో వధూవరులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు.

 It Will Be Shocking To See How The Bride Behaved In An Unwanted Wedding ..! Marr-TeluguStop.com

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తుంటారు.వధూవరులు చేసే సందడి చూపరులను కట్టి పడేస్తుందనే చెప్పాలి.

కానీ పెద్దల కారణంగా ఇష్టం లేని పెళ్లి చేసుకొనే వధువు లేదా వరుడు తమ పెళ్లిని ఒక నరకంలా భావిస్తారు.వారి మొహంలో నవ్వుకి బదులు తీవ్ర విషాదం ఉట్టిపడుతుంది.

తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఒక సంఘటన చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియో పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

ఇంతకీ ఈ వీడియో లో ఏముందంటే.

వధూవరులు పెళ్లి దండలు మార్చుకుంటున్నారు.అయితే వధువు మాత్రం పెళ్ళి దండలు మార్చుకునేందుకు చాలా అయిష్టంగా కనిపించింది.

పెళ్లి దండను గట్టిగా ఝళిపిస్తూ తన అసహనాన్ని పెళ్లి మండపం పైనే తెలియజేసింది వధువు.దాంతో ఇది చూసిన పెళ్ళికొడుకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

వధువు ఇలా ప్రవర్తిస్తుందేంటి అని అతడు తేరా పారా చూస్తూ అలానే ఉండిపోయాడు.

Telugu Groom, Latest-Latest News - Telugu

ఇక వధువు బంధువులు మాత్రం పెళ్లి దండ వేయాలంటూ బతిమిలాడటం కూడా కనిపించింది.కానీ అప్పటికీ వధువు తన అయిష్టాన్ని స్పష్టంగా చూపించింది.ఇష్టం లేని వ్యక్తిని మొగుడిగా భరించాలనే బాధను ఆమె గుండెల్లో దాచుకుందని అక్కడున్న వారందరికీ బహుశా అర్థమయ్యే ఉంటుంది.

అయితే కొందరు ఈ వధువు ప్రవర్తనకు సంబంధించి ఒక వీడియో తీశారు.అనంతరం దాన్ని నెట్టింట్లో షేర్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ గా మారింది.ఇప్పుడే ఈ వధువు ఇలా ప్రవర్తిస్తుంటేఇక భవిష్యత్తులో వీరి కాపురం ఎలా ఉంటుందో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube