కేటీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌..

అధికారంలో ఉన్న‌ప్పుడు ఏ ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి.ఇక బాగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశాల‌పై ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.

 Bjp, Congress Are Pitting Ktr Against Each Other., Ktr, , Congress , Ts Poltics-TeluguStop.com

ఏ మాత్రం పొర‌పాటు చేసినా స‌రే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా ఇలాంటి పొర‌పాటే చేశారు.

ఆయ‌న ఎప్పుడూ కూడా చాలా జాగ్ర‌త్త‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.కానీ మొన్న త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయ‌న్ను ఇర‌కాటంలో ప‌డేస్తుంది.

సైదాబాద్ లోని సింగరేణి కాలనీలోని చిన్నారిపై జ‌రిగిన అత్యాచారం ఘ‌ట‌న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం తెలిసిందే.

రాజు అనే వ్య‌క్తి పాప‌పై హత్యాచారం చేయటంతో రాష్ట్రం మొత్తం భ‌గ్గుమంటోంది.

ఈ ఘ‌ట‌న‌పై మొద‌ట స్పందించిన కేటీఆర్ హత్యాచారం చేసిన నిందితుడిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే త‌మ పోలీసుల అరెస్టు చేశార‌ని, అత‌డు త‌మ అదుపులోనే ఉన్నాడంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.కాగా ఆయ‌న ట్వీట్ చేసిన త‌ర్వాత నిందితుడిని ప‌ట్టించిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్ర‌క‌టించ‌డంతో సంచ‌ల‌నం రేగింది.దీంతో ప్ర‌తిప‌క్షాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ దీనిపై కేటీఆర్‌ను ఆడేసుకున్నారు.

కేటీఆర్ ఓ మాట పోలీసులను ఓ మాట చెబుతున్నార‌ని, ఇందులో ఏది క‌రెక్టో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Trs, Ts Congress, Ts Poltics-Telug

ఇక ఇదే స‌మ‌యంలో అటు కేటీయార్ కూడా తన ట్వీట్ ను డిలిట్ చేసి, త‌న‌కు ఆఫీస‌ర్లు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, క్ష‌మించాల‌ని ఒప్పుకున్నారు.ఇప్పుడు ఇదే అంశం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.మంత్రిగా ఉండి ఆ మాత్రం స‌మ‌చారం తెలియ‌కుండా ఎలా ట్వీట్ చేస్తార‌ని మండిప‌డుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు.

ఆయ‌న ఏమైనా మత్తులో ఉన్నారా అంటూ నిల‌దీస్తున్నాయి.అటు బీజేపీ కూడాదీనిపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఇలాంటి మంత్రి అవ‌స‌ర‌మా అంటూ నిన‌దిస్తోంది.దీంతో కేటీఆర్ ఎలాంటి స్పంద‌న చేయ‌ట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube