బరువు తగ్గేందుకు బాగానే కష్ట పడుతున్న హీరోయిన్...

తెలుగులో విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, శ్రీకాంత్ తదితర స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ వెటరన్ హీరోయిన్ “స్నేహ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి స్నేహ తెలుగులో ప్రముఖ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన “తొలివలపు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

 Veteran Heroine Sneha Workout For Weight Loss, Weight Loss, Veteran Heroine, Sne-TeluguStop.com

ఆ తర్వాత క్రమక్రమంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులని బాగానే అలరించింది.

కాగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గి పోయిన సమయంలో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.

ఈ క్రమంలో తమిళ ప్రముఖ నటుడైన ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కాగా ప్రస్తుతం నటి స్నేహ కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.అయితే పెళ్లయిన తర్వాత కూడా నటి స్నేహ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరించింది.కాగా ఆ మధ్య తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

Telugu Sneha, Telugu Actress, Tollywood, Veteran, Veteransneha-Movie

అయితే ఈ మధ్యకాలంలో నటి స్నేహ కొంతమేర బరువు పెరిగినట్లు తెలుస్తోంది.దీంతో నటి స్నేహ మళ్ళీ బరువు తగ్గేందుకు బాగానే శ్రమిస్తోంది.ఈ క్రమంలో ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ ని నియమించుకొని జిమ్ లో బాగానే వర్కౌట్లు చేస్తుంది.అంతేకాకుండా ప్రత్యేక ఆహారపు డైట్ కూడా పాటిస్తోంది.కాగా ఇటీవలే నటి స్నేహ లో వర్కౌట్లు చేస్తుండగా తీసినటువంటి వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

కాగా ఇటీవలే నటి స్నేహ తమిళ భాషలో “పటాస్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అనువాదం చేసి విడుదల చేశారు.ప్రస్తుతం నటి స్నేహ తమిళంలో నూతన దర్శకుడు ఆర్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న “వాన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube