కోనసీమ జాలర్లకు చిక్కిన ఖరీదైన చేప.. ధర తెలిస్తే షాకే!

ఇటీవల కాలంలో చేపలు దాదాపు బంగారంతో సమానంగా ధర పలుకుతున్నాయి.ఒకప్పుడు రూ.

 Expensive Fish Entangled For Konaseema Fishermen .. Shock If You Know The Price!-TeluguStop.com

వందల్లో పలికిన చేపలు ఇప్పుడు వేలల్లో పలుకుతున్నాయి.దాంతో జాలర్లు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.

ఇక అరుదైన చేపలు దొరికిన మత్స్యకారులు లక్షలాది రూపాయలను తన జేబుల్లో వేసుకుంటున్నారు.తాజాగా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన జాలర్లు సైతం లక్షల రూపాయలు సంపాదించారు.

ఊహించని రీతిలో వీరికి ఒక అరుదైన భారీ చేప దొరికింది.ప్రస్తుతం ఈ చేప ధర గురించి స్థానికంగా పెద్ద చర్చే జరుగుతోంది.

ఎందుకంటే దీని ధర అక్షరాలా రెండున్నర లక్షలట!! మరి ఆ స్థాయిలో ధర పలుకుతున్న ఈ చేప విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

దేశమంతటా వర్షాలు కురుస్తున్న వేళ గోదావరిలోకి అనేక అరుదైన భారీ చేపలు కొట్టుకు వస్తున్నాయి.

ఈ క్రమంలో మత్స్యకారులు చేపలు పట్టడం ప్రారంభించారు.అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా పి.

గన్నవరం గోదావరిలో మత్స్యకారుల గేలం ముల్లుకు ఒక భారీ చేప చిక్కింది.పి.గన్నవరం అక్విడెట్ సమీపంలో బ్రీజ్ పైనుంచి గేలం ముల్లు విసరగా.దానికి ఒక అరుదైన చేప చిక్కింది.

ఈ చేపను సాయంత్రం వేళ పట్టుకున్నట్లు తెలుస్తోంది.దీని బరువు 10 కిలోలు.

దీని పొడవు 3 అడుగులు.ఈ అరుదైన చేపని ఆలుగు చేప అని పిలుస్తారు.

అయితే అరుదైన చేప కావడంతోపాటు ఇది భారీగా ఉండటంతో జాలర్ల పంట పండింది.

Telugu Aalugu Fish, Fish, Fisherman, Gannavaram, Latest-Latest News - Telugu

వర్షాల కారణంగా పెరిగిపోయిన వరద ప్రవాహం వల్ల ఇలాంటి భారీ చేపలు వలలకు చిక్కే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి ఇప్పటికే చాలా పెద్ద, అరుదైన చేపలు వచ్చాయని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కోనసీమ జాలర్లు గేలం ముల్లు వేసి లక్షల రూపాయలు సంపాదించుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పులస చేపలకు మంచి డిమాండ్ ఏర్పడింది.ఈ చేపల రుచి అమోఘంగా ఉండటంతో చాలామంది ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేస్తూ కొనుగోలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube