రాజీనామాల స‌వాళ్ల‌తో రాజ‌కీయ దుమారం.. కేటీఆర్ వ‌ర్సెస్ బండి సంజ‌య్‌..

తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌రోసారి బీజేపీ, టీఆర్ఎస్ వేడెక్కించాయి.ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇది అయిపోయేలోపు వీలైనంత వ‌ర‌కు పెద్ద ఎత్తున స‌భ‌లు, స‌మావేశాలు, పాద‌యాత్ర‌లు చేసి తెలంగాణ‌లో బ‌లం పెంచుకోవాల‌ని చూస్తోంది బీజేపీ.

 Political Scandal With Resignation Challenges Ktr Vs. Bandi Sanjay Bandi Sanjay,-TeluguStop.com

ఇక ఇలా చేసిన త‌ర్వాత ఎలాగూ హుజూరాబాద్లో గెలుస్తామ‌నే ధీమా ఉంది కాబ‌ట్టి త‌మ బ‌లం పెరిగింది అని ప్ర‌చారం చేసుకోవ‌చ్చని ప్లాన్ వేస్తోంది.ఈ నేప‌థ్యంలోనే బండి సంజ‌య్ పాద‌యాత్ర కూడా మొద‌లు పెట్టేశారు.

ఇంకోవైపు 17న తెలంగాణ విమోచ‌న స‌భ‌ను కూడా నిర్వ‌హించ‌బోతున్నారు.

దీంతో బీజేపీ దూకుడుపై ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేంద్రం నుండి తెలంగాణ‌కు రావాల్సిన నిధులపై ఇరువర్గాల మధ్య మ‌రోసారి స‌వాళ్ల ప‌ర్వం కొనసాగుతోంది.వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా కేంద్రం నుండి వచ్చే నిధులపై ప్ర‌శ్నిస్తున్న మంత్రి కేటీఆర్ ఇదే విష‌యంపై మరోసారి మాటలు సంధించారు.

తెలంగాణ నుండి తీసుకుపోతున్న‌ప్రతి రూపాయిలో కేంద్రం నుంచి కేవలం యాబై శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, కేంద్రం తెలంగాణ‌పై వివ‌క్ష చూపుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Huzurababd, Tg-Telugu Political News

ఇక మ‌రో అడుగు ముందుకు వేసి తాను చెప్పిన లెక్కల్లో ఏదైనా తేడా అనిపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధ‌మని, దీనిపై బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్పాల‌ని సవాల్ విసిరారు.ఇక ఈ స‌వాల్‌ను బండి సంజయ్ స్వీక‌రించాల‌ని, ఒక‌వేళ నిజ‌మే అయితే ఆయ‌న రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇక బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కేటీఆర్ వితుపాకి రాముడి మాటల లాంటివ‌ని, త‌న‌తో పాటు సీఎం కేసీఆర్ కూడా రాజీనామా చేస్తే అప్పుడు మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి నిజాలు తెలుసుకుందామ‌ని చెప్పారు.ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ వైరం మరోసారి ముదిరింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube