బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన కళ్యాణి ప్రియదర్శన్.. అక్కడైనా?

డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురిగా అక్కినేని అఖిల్ హీరోగా నటించినటువంటి “హలో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ, నటి కళ్యాణి ప్రియదర్శన్.మలయాళం, తమిళ భాషల్లోనూ నటిస్తూ.తన ఇమేజ్ పెంచుకుంటున్నారు కల్యాణీ.న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసిన ఈమె… యాక్టింగ్ లోకి ప్రవేశించేకన్నా ముందే హృతిక్ రోష‌న్ నటించిన క్రిష్ 3, విక్ర‌మ్ ఇరుముగ‌న్ సినిమాల‌కు అసిస్టెంట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా ప‌నిచేశారు.
అయితే డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురిగా సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసిన ఈ మలయాళ బ్యూటీ… హలో తర్వాత ల‌హ‌రి, ర‌ణరంగం మూవీల్లోనూ నటించారు.అవి అంత భారీ విజయాన్ని అందుకో లేకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదని ఈ క్రమంలోనే కళ్యాణి తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు.

 Actress Kalyani Priyadarshan Ready For Bollywood Entry, Actress Kalyani Priyadar-TeluguStop.com

తాజా వివరాల ప్రకారం కల్యాణీ ప్రియదర్శన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోసం బాలీవుడ్ లో తెరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

విశేషమేమిటంటే కల్యాణీ తన్ తండ్రి మద్దతు లేకుండానే హిందీలోనూ టాలెంట్ ను చూపించుకునేందుకు తహ తహ లాడుతున్నారు.

హేరా పేరి, హంగామా, భూల్ భూల‌య్యా, హంగామా, మాల‌మాల్ లాంటి కామెడీ చిత్రాలను తెర‌కెక్కించి హిందీలో మంచి పాపులారిటీ సంపాదించారు ప్రియ‌ద‌ర్శ‌న్.

Telugu Actresskalyani, Bollywood, Priyadarshan-Movie

ఈ డైరెక్ట‌ర్ కు బాలీవుడ్ లో తన తండ్రికి నిర్మాణ సంస్థ‌లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంచి ప‌రిచ‌యాలున్నప్పటికీ… క‌ల్యాణి మాత్రం తన తండ్రి నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా స్వతహాగా ముందుకు సాగాలనుకోవడం నిజంగా మెచ్చుకోదగిన అంశం.తండ్రి మద్దతు లేకుండా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కడైనా మంచి విషయాలను అందుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube