కువైట్ వెళ్ళిన ప్రవాసులకు బిగ్ షాక్...!

కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో కువైట్ లో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది ప్రవాసులు వారి వారి దేశాలకు వలసలు వెళ్ళిపోయారు.అలా వెళ్ళిన వారిలో ఎంతో మంది కువైట్ విధించిన ఆంక్షల నేపధ్యంలో అలాగే కరోనా విజ్రుంబిస్తున్న క్రమంలో ఏడాదిన్నర పాటు వారి వారి దేశాలకు పరిమితమయ్యారు.

 Big Shock To Kuwait Nris, Kuwait People, Covid Effect, Kuwait People, Corona, Nr-TeluguStop.com

దాంతో ఎంతో మంది వలస వాసులు సరైన ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.తమవద్ద దాచుకున్న సొమ్ముతో కొందరు నెట్టుకొస్తే మరికొందరు అప్పులు చేసి కాలం వెళ్ళ దీయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ సమయంలోనే

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, కువైట్ ఆంక్షలు సడలించి వలస వాసులకు నిభంధనలతో కూడిన ఆహ్వానం పలకడంతో ఎంతో మంది వలస వాసులు మళ్ళీ కువైట్ కు క్యూ కట్టారు.కోవిడ్ నిభందనలు పాటిస్తూ, కువైట్ విధించిన ఆక్షలను అనుసరిస్తూ అష్ట కష్టాలు పడుతూ కువైట్ లోకి అడుగుపెట్టిన ప్రవాసులు అక్కడ ఎదురవుతున్న పరిణామాలు చూసి షాక్ అవుతున్నారు.

కువైట్ చేరి తమ తమ ఉద్యోగాలకు వెళ్తున్న వారికి బిగ్ షాక్ తగులుతోందట.అదేంటంటే.

కరోనా సమయంలో ఎంతో మంది ప్రవాసులు ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు చేశారు ఇదే సమయంలో కరోనా తీవ్రమవడంతో స్వదేశాలకు వెళ్ళిపోయారు.మళ్ళీ తిరిగి వచ్చిన క్రమంలో వారికి గతంలో చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారుతున్నాయి.

అంతేకాదు వారు అద్దెకు ఉన్న ఇళ్ళకు అద్దెలు చెల్లించకుండా ఉండటం, కారు లోను కట్టుబడి, ఇతరాత్రా లోన్లు ఇలా ఒకటి తరువాత ఒకటి ఒకటి వారికి తలకు మించిన భారంగా మారుతున్నాయి.మా అప్పు తీర్చాలంటే మా అప్పు తీర్చాలని అందరూ ఒకేసారి వచ్చిపడుతున్నారట.

ఈ అప్పులు అన్నీ తీర్చాలంటే నెలలు పడుతుందని, అప్పటి వరకూ ఎవరూ వేచి చూసే పరిస్థితి కనపడటం లేదని ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదని తలలుపట్టుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube