శ్రీదేవి జీవితంలో అత్యంత విషాదకర ఘటన ఏంటో తెలుసా?

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు.వందల సంఖ్యలో సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు కెరీర్ ను కొనసాగించారు.

 Did You Know Actress Sridevi Conducted Mothers Funeral, Conducted, February 28,-TeluguStop.com

కన్దన్ కరుణై అనే కోలీవుడ్ మూవీతో శ్రీదేవి నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఆ సినిమాలో బాలనటిగా శ్రీదేవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.2018 సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీన ప్రమాదవశాత్తూ శ్రీదేవి మృతి చెందారు.

శ్రీదేవి తల్లి పేరు రాజేశ్వరి కాగా ఆమె తండ్రి పేరు అయ్యప్పన్.

శ్రీదేవి లమ్హే అనే మూవీ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆమె తండ్రి, జుదాయి అనే మూవీ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఆమె తల్లి మృతి చెందారు మన దేశంలోని ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం తల్లి చితికి పెద్ద కొడుకు మాత్రమే నిప్పును అంటించారు.సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులతో శ్రీదేవికి అనుబంధం చాలా ఎక్కువ.

ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోన్ లో పేరెంట్స్ తో మాట్లాడుతూ శ్రీదేవి ఉండేవారు.

Telugu Ayyappan, February, Mother Funeral, Mothers Funeral, Raghavendra Rao, Sri

తల్లిదండ్రులను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు షూటింగ్ లకు వెళ్లడం శ్రీదేవికి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు వెళ్లాల్సి వచ్చేది.తండ్రి చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి శ్రీదేవి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని సమాచారం.తల్లి చనిపోవడం శ్రీదేవి జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన.తెలుగులో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్లో శ్రీదేవి ఎక్కువగా నటించారు.

Telugu Ayyappan, February, Mother Funeral, Mothers Funeral, Raghavendra Rao, Sri

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కమల్ హాసన్ సినిమాల్లో శ్రీదేవి ఎక్కువగా నటించారు.హిందీలో రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్న నటీమణుల్లో శ్రీదేవి కూడా ఒకరు.దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగిన శ్రీదేవి అంత్యక్రియలు ఫిబ్రవరి 28వ తేదీన జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube