నా మాజీ ప్రియుడు యాసిడ్ ఎటాక్ చేయాలనుకున్నాడు... బిగ్ బాస్ కంటెస్టెంట్!

భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో అత్యంత పారితోషికం తీసుకునే కథానాయికగా ఎదిగిన నటీ మణుల్లో… అక్షర సింగ్ ఒకరు.రొమాన్స్, పొలిటికలే కాకుండా యాక్షన్, డ్రామా వంటి ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు.

 Akshara Singh Said My Ex Boyfriend Sent Few Boys With Acid Bottles, Akshara Sin-TeluguStop.com

ఇక విషయానికొస్తే… హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్‌, భోజ్‌పురి ఫేమ్‌ అక్షర సింగ్‌ ఈ మధ్యే వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌లో షో నుంచి ఎలిమినేట్‌ అయ్యారు.తాజాగా ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…తన మాజీ ప్రియుడి వల్ల నరకం చూశానని చెప్పుకొచ్చారు.

తనపై యాసిడ్‌ దాడి చేయించేందుకు అతడు కుట్ర పన్నాడని, తన కెరీర్‌ నాశనం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నించాడని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఒకరోజు రోడ్డుపై ఒంటరిగా వెళ్తుండగా కొందరు యాసిడ్‌ బాటిళ్లతో నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారని… వీధుల్లో డ్రగ్స్‌ తీసుకునేవారిని నాపై దాడి చేసేందుకు నియమించాడని… అంతే కాకుండా .తన కెరీర్‌ను నాశనం చేస్తానని, ప్రాణాలతో వదిలిపెట్టనని మాజీ ప్రియుడు తరచూ బెదిరించేవాడని ఆమె అన్నారు.దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్టు అక్షర వాపోయారు.

Telugu Acid Bottles, Akshara Singh, Aksharasingh, Bojpuri, Bollywood, Boyfried,

సినీ పరిశ్రమ నుంచి తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని బాధపడ్డారు.కొందరు నన్ను ఓదార్చడానికి వచ్చినా… తాను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అందుకే తనకిలా జరుగుతోందని చెప్పారే తప్ప ఎవరూ సపోర్ట్‌ గా నిలవలేదని అక్షర సింగ్ అవేధన వ్యక్తం చేశారు.ఒంటరిగా మారిన తనకు ఇండస్ట్రీలో సినిమాలు ఇవ్వడం కూడా ఆపేశారని,ఆ సమయంలో ముంబైలో ఎలా బతికానన్నది తనకు, తన కుటుంబానికి మాత్రమే తెలుసు అంటూ నిట్టూర్చారు.

Telugu Acid Bottles, Akshara Singh, Aksharasingh, Bojpuri, Bollywood, Boyfried,

అప్పుడే మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయడం ప్రారంభించిన తాను సంపాదించిన దానితో పాటు అప్పు తీసుకొచ్చి మరీ దానిపై ఖర్చు పెట్టానని… ఎందుకంటే తను సినిమా అవకాశాలు రావని అర్థమైందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇంతకు ముందే తాను సంతకం చేసిన సినిమాల్లో నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా తీసివేయడంతో సొంతంగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయడం మొదలుపెట్టానని వివరణ ఇచ్చారు.దీనికి ప్రశంసలు దక్కడంతో పాటు డబ్బులు కూడా వచ్చాయని అన్నారు.

ప్రతీ పనిలోనూ తనకు అడ్డు పడుతున్న తన మాజీ ప్రియుడు.నా పాటలు ఏ మ్యూజిక్‌ కంపెనీ తీసుకోకుండా వారి మీద ఒత్తిడి తెచ్చారని.

తనని బతకనివ్వకూడదన్నది అతడి కోరిక అని బాధపడ్డారు.అక్కడితో వెనకడుగు వేయకుండా .సొంతంగా తానే కంపెనీ పెట్టి తన పాటలను లాంచ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యానని చెప్పుకొచ్చింది నటి అక్షర సింగ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube