9/11 దాడులు: తాలిబన్ లాగా వున్నాడని సిక్కు వ్యక్తి కాల్చివేత.. నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న కుటుంబం

అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా దాడి చేసి నిన్నటికి సరిగ్గా 20 ఏళ్లు గడిచాయి.ఈ ఘటనలో మరణించిన ప్రజలు, సైనికులు, ఇతర సిబ్బందికి వారి కుటుంబ సభ్యులతో పాటు అమెరికన్లు నివాళులర్పించారు.

 Brother Of Sikh Man Killed In 9/11 Hate Attack Shares Message Of Unity , America-TeluguStop.com

అయితే ఈ దాడి తర్వాత ముస్లింలు, దక్షిణాసియా వాసులు, సిక్కులపై విద్వేషదాడులు పెరిగిపోయాయి.భౌతిక దాడులతో పాటు వారిని చంపేందుకు కూడా అమెరికన్లు వెనుకాడలేదు.

అలాంటి ఒక ఘటనలో మరణించిన సిక్కు వ్యక్తికి అతని కుటుంబం శ్రద్ధాంజలి ఘటించింది.ఈ సందర్భంగా ఉగ్రవాద దాడుల తర్వాత జరిగిన విద్వేష దాడిలో ప్రాణాలు కోల్పోయిన తొలి సిక్కు వ్యక్తి బల్బీర్ సింగ్ సోది సోదరుడు రానా సింగ్ సోది నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్నాడు.

సిక్కులు ఎల్లప్పుడూ అందరికీ న్యాయం కోసం నిలబడ్డారని.కానీ విభిన్న రంగు, మతం కారణంగా 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత ద్వేషానికి గురయ్యారని చెప్పాడు.

ఈ క్రమంలో బలైన తొలి బాధితుడిగా తన సోదరుడు నిలిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

సిక్కు మతాన్ని అనుసరించే తన సోదరుడు ఎల్లప్పుడూ తలపై గడ్డం, తలపాగాతో వుండేవాడని రానా తెలిపారు.

ఈ క్రమంలో ఓ అమెరికన్ ఆయనను తాలిబన్‌గా భావించి కోపంతో కాల్చిచంపాడని ఓ వీడియో సందేశంలో గుర్తుచేసుకున్నారు.సెప్టెంబర్ 15, 2001న బల్బీర్ సింగ్ మీసాలోని తన గ్యాస్ స్టేషన్ వెలుప వున్నప్పుడు ఆయనపై దుండగుడు విద్వేష దాడికి తెగబడ్డాడని రానా తెలిపారు.

Telugu Al Qaeda, America, Balbir Singh, Brothersikh, Frank Rock, Muslims, Sikhs,

9/11 దాడి తర్వాత చోటు చేసుకున్న తొలి విద్వేష దాడిగా ఈ ఘటన చరిత్రకెక్కిందని.తన సోదరుడిని చంపిన వ్యక్తి ప్రస్తుతం ఫ్రాంక్ రోక్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడని రానా వెల్లడించారు.తన సోదరుడిని కాల్చి చంపినట్లు తనకు ఓ ఉద్యోగి ఫోన్ చేసి చెప్పాడని రానా వెల్లడించారు.అయితే తొలుత నేను దానిని నమ్మలేదని.తాను బల్బీర్‌కు కాల్ చేయగా ఎంతకు లిఫ్ట్ చేయలేదని దీంతో అతను చనిపోయాడని నిర్థారించుకున్నానని రానా కంటతడి పెట్టారు.ఈ ఘటనకు పాల్పడిన హంతకుడిని 24 గంటల్లో పట్టుకుని జైల్లో పెట్టడం వల్ల తన కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

Telugu Al Qaeda, America, Balbir Singh, Brothersikh, Frank Rock, Muslims, Sikhs,

ఈ వీడియోలో 9/11 దాడులు జరిగిన రోజున తన సోదరుడు ఫోన్ చేశాడని.టీవీని ఆన్ చేసి వార్తలను చూడమని చెప్పినట్లు రానా గుర్తుచేసుకున్నారు.మనదేశంపై దాడి జరిగిందని.ఒసామా బిన్ లాడెన్‌ ఫోటోలను టీవీలో చూపించడం మొదలుపెట్టారని అతను నాతో చెప్పాడని వెల్లడించారు.ఉగ్రవాద దాడుల తర్వాత స్థానిక అమెరికన్లు విద్వేషంతో రగిలిపోయారని .వారు ‘‘ మీ దేశానికి మీరు వెళ్లిపోండి’’ అంటూ బెదిరింపులకు పాల్పడేవారని రానా చెప్పారు.ప్రతి ఏడాది బల్బీర్‌ చనిపోయిన రోజున తమ కుటుంబం గ్యాస్ స్టేషన్ వద్దకు చేరుకుని అతనికి నివాళులర్పిస్తామని అతని సోదరి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube