భారత ఎన్నారై స్టూడెంట్ కు గుడ్ న్యూస్..కువైట్ క్రికెట్ సంచలన నిర్ణయం...!!

కువైట్ క్రికెట్ లో ఆడే వారికి స్కాలర్ షిప్స్ అందించనున్నట్టుగా కువైట్ ప్రకటించింది.ఈ మేరకు సాల్మియాలోని ఆసియా ఒలంపిక్ కౌన్సిల్ ముఖ్య కార్యాలయంలో ఏంఈసి స్టడీ గ్రూప్, కువైట్ క్రికెట్ కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.

 Good News For Indian Nri Student Kuwait Cricket Sensational Decision , Mec Study-TeluguStop.com

ముఖ్య అధికారులు అందరూ పాల్గొన్న ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఎవరైతే కువైట్ క్రికెట్ లో రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రం ఏంఈసి స్టడీ గ్రూప్ తో కలిసి స్కాలర్ షిప్ లు అందిస్తామని ప్రకటించింది.ఇందులో భాగంగా ఏంఈసి స్టడీ గ్రూప్ సిఈవో కువైట్ క్రికెట్ అధ్యక్షులు ఆమోదం చేస్తూ సంతకాలు చేశారు.

ఇదిలాఉంటే కువైట్ క్రికెట్ డైరెక్టర్ జనరల్ సాజిద్ అష్రఫ్ మాట్లాడుతూ కువైట్ ఇప్పుడు 104 దేశాలలో ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా పోల్చుకుంటే 20 ర్యాంకింగ్ లో 27 స్థానంలో ఉందని ఇక మహిళల జట్టు 104 మంది సభ్యులతో 26 వ స్థానంలో ఉందని, తెలిపారు.జిసిసి నుంచీ ఆసియా జూనియర్ జట్టుకు ఎంపిక అయిన ఏకైక దేశం కువైట్ మాత్రమేనని అన్నారు.

క్రికెట్ ఆడే ప్రతీ ఒక్కరిలో తమ విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని అందుకు తాము ఎలాంటి సాయం అందించడానికి కూడా వెనుకాడమని తెలిపారు.

కువైట్ తో భాగస్వామ్యంతో ఉన్నత చదువుల కోసం కలాసాలల ఫీజుపై సుమారు 25 శాతం స్కాలర్ షిప్ తో ఆటగాళ్లకు ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 700 పైగా యూనివర్సిటీలతో భాగస్వాయం ఉందని ఆయా యూనివర్సిటీల ఫీజులను బట్టి 25 శాతం వరకూ స్కాలర్ షిప్ పొందుతారు.ఇదిలాఉంటే కువైట్ క్రికెట్ టీమ్ లో స్థానికంగా ఉన్న భారత సంతతి విద్యార్ధులు ఎంతో మంది ఆడుతున్నారని , తాజాగా స్కాలర్ షిప్స్ ప్రవేశపెట్టడంతో ఎంతో మంది భారతీయ విద్యార్ధులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube