మ‌న‌సులు దోచేస్తున్న న‌గ‌ల ప్ర‌క‌ట‌న‌.. ట్రాన్స్‌జెండర్ల విష‌యంలో ఇదో గొప్ప సందేశం..

మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డైనా స‌రే ట్రాన్స్ జెండ‌ర్ల విష‌యంలో ఎన్నో ర‌కాల అన‌ర్థాలు జ‌రుగుతూనే ఉన్నాయి.ఇంక మ‌న దేశంలో అయితే ఇలాంటి అసమానతలకు సంబంధించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

 This Is A Great Message In The Case Of Transgender People. Transgender, Gold Add-TeluguStop.com

ఇప్ప‌టికే ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం చూస్తూనే ఉన్నాం.ఇక‌పోతే ఇలాంటి ప‌రిస్థితులు దేశంలో ఉన్న స‌మ‌యంలో ఓ వీడియో మ‌న‌సులు గెలుచుకుంటోంది.

కాగా ఇది కూడా ట్రాన్స్‌జెండర్ ల‌కు సంబంధించిన విష‌యాన్ని చాలా సున్నితంగా న‌గ‌ల‌కు యాడ్ చేసి చెప్ప‌డంతో అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

అయితే ఇందులో ట్రాన్స్ జెండ‌ర్ మోడల్ నటించిన తీరు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

ఎందుకంటే ఇందులో భారతీయ సాంప్రదాయ ఆభరణాల ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తూ వారి ప‌ట్ల ఎంత సానుభూతితో ఉండాలో నిరూపించింది.అయితే ఈ యాడ్ వీడియో దాదాపుగా ఒక‌ నిమిషం 40 సెకన్ల పాటు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా ఈ వీడియోలో ఓ ట్రాన్స్‌జెండర్ అస‌లు త‌న జీవితంలో ఎలా మార్పు చెందుతుంది ఆ త‌ర్వాత ఆమె ఓ అందమైన న‌వ వధువుగా మార‌డానికి న‌గ‌లు ఎలా ఉప‌యోగ‌ప‌డుతాయో చూపించారు.

అయితే ఇందులో మ‌న‌కు స్వచ్ఛమైన ప్రేమ అనే కాన్సెప్ట్‌తో న‌గ‌ల ప్రాముఖ్యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.ఆ వ్య‌క్తి ట్రాన్స్‌జెండర్‌ అని త‌మ తెలిస్తే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు అస‌లు ఎలా అర్థం చేసుకుంటార‌నేది ఈ జ్యూవెలరీ యాడ్‌లో డైరెక్ట‌ర్లు అద్భుతంగా చూపించారు.కాగా ఈ ప్ర‌క‌ట‌న‌ను కేరళకు చెందిన ప్రముఖ న‌గ‌ల కంపెనీ అయిన భీమా రూపొందించింది.కాగా ఇందులో యువ‌కుడు ట్రాన్ష్ జెండ‌ర్ నుంచి అమ్మాయిగా మారే క్ర‌మంలో ప్రతీ ప్రత్యేక సందర్భంలోనూ త‌న తల్లిదండ్రులు న‌గ‌ల రూపంలో ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంది.

ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చే వీడియోలు ఇంకా రావాల‌ని నెట‌జిన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube