ఆ ముగ్గురి చుట్టే తెలంగాణ రాజ‌కీయాలు.. ఫ్యూచ‌ర్ ఎవ‌రిదో..?

తెలంగాణ రాజకీయాల‌ను గ‌తంలో చూసుకుంటే కేవ‌లం టీఆర్ఎస్‌దే భ‌విష్య‌త్ అంతా అన్న‌ట్టు క‌నిపించేంది.దీంతో అస‌లు ఆ పార్టీకి ఎదురుందా అనే అనుమానం క‌లిగేది.

 Telangana Politics Around The Three Future Anyone Ktr, Revanth Latest News-TeluguStop.com

ఎందుకంటే అప్ప‌టికే బీజేపీ ఇంకా మ‌న ద‌గ్గ‌ర బ‌ల‌ప‌డ‌లేదు.ఇక కాంగ్రెస్‌లో ఉన్న వారంద‌రినీ త‌మ పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ బ‌ల‌ప‌డిపోయింది.

ఇంకేముంది.ఇంక భవిష్య‌త్‌లో అంటే ఇప్ప‌ట్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టే నాయ‌క‌త్వం రాద‌ని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో బండి సంజ‌య్ రూపంలో బీజేపీకి అనూహ్యంగా బ‌లం పెరిగిపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప‌వ‌నాలు వీస్తున్నాయి.

ఇక బండి సంజయ్ అధ్య‌క్షుడిగా అయిన త‌ర్వాత బీజేపీ ప‌రుగులు పెడుతోంది.

ఆయ‌న కేంద్రంలోని బీజేపీ అధికారం త‌న‌కు అండ‌గా ఉంద‌ని ఇక్క‌డ ఫుల్ జోష్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు.ఆయ‌న అధ్య‌క్షుడు అయిన తర్వాతే పార్టీలో యూత్ ఫాలోయింగ్ పెరిగింది.

ఇక ప‌డిపోతున్న కాంగ్రెస్‌కు రేవంత్ రూపంలో కొత్త నాయ‌క‌త్వం వ‌చ్చింది.ఆయ‌న మొదటి నుంచి మంచి మాటకారిగా గుర్తింపు ఉన్న నేత‌.

ఎంతో విషయ పరిజ్ఞానం ఉండటంతో పాటు అన‌ర్గ‌లంగా మాట్లాడి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోగ‌ల నేత‌గా ఆయ‌న‌కు పేరుంది.

Telugu Bandi Sanjay, Cm Kcr, Congress, Revanth, Tg-Telugu Political News

ఇక కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆయ‌న త‌న మాట‌లు, రాజ‌కీయాల‌తో జోష్ పెంచేస్తున్నారు.ఇక మ‌రీ ముఖ్యంగా యూత్ లో రేవంత్ కు బ‌ల‌మైన ఫాలోయింగ్ ఉండ‌టం పెద్ద ప్ల‌స్ పాయింట్‌.ఇక అంద‌రికంటే ముఖ్యంగా కేటీఆర్ విషయానికి వ‌స్తే భావి సీఎం అంటూ ఇప్ప‌టికే ఆయ‌న ముద్ర వేసేసుకున్నారు.

టీఆర్ ఎస్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే గ‌న‌క ఆయ‌నే సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.ఇక కేసీయార్ కొడుకనే ట్యాగ్ ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే అంశం.

ఇక ప్ర‌భుత్వాన్ని ఆయ‌నే న‌డిపిస్తున్నారు.పార్టీలో కేసీఆర్ త‌ర్వాత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కాబ‌ట్టి ఈ ముగ్గురి చుట్టే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాలు తిరుగుతున్నాయి.ఏది మాట్లాడినా వీరి ముగ్గురి గురించే అన్న‌ట్టు ఉంది.

మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత్యంత ప్ర‌భావం చూపుతారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube