వామ్మో.. ఆ డేగలో ఏముంద‌ని అన్ని కోట్లు పెట్టారు..

పేరు ప్ర‌తిష్ట‌ల కోసం కొంతమంది తెగ ఆరాట‌పడుతుంటారు.అలాంటి వారు ముందు వెనుక ఆలోచించకుండా.

 The-eagle-is-too-costly-in Soudhi Arabhiya Eagle, Viral News, Soudhi Arabhiya  ,-TeluguStop.com

వారి దగ్గరున్న డబ్బుతో త్వ‌ర‌గా నిర్ణయాలు తీసుకుని న్యూస్‌లో నిలుస్తుంటారు.అయితే.సౌదీకి చెందిన షేక్‌ అలాంటి పేరు ప్ర‌తిష్ట‌ల కోసం 3.4 కోట్లు పెట్టి తెల్లని డేగను కొనుక్కుకున్నాడు.సౌదీ అరేబియాలోని మల్హంలో పెద్ద‌ ఎత్తున జరిగిన వేలం పాట‌లో దీనికా ధ‌ర పలికింది.ఈ వైట్‌ గైర్‌ ఫాల్కన్‌ అమెరికాకు చెందింది.ఇది డేగ జాతుల్లో అతి పెద్దద‌ని సౌదీ మీడియా సంస్థలు వివ‌రించాయి.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న మాల్‌హామ్‌లో ఇంటర్నేషనల్ ఫాల్కన్ బ్రీడర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ వేలాన్ని నిర్వహించారు.

ఈ వేలంలో పెద్దపెద్ద కోటీశ్వ‌ర్లు పాల్గొన్నారు.ఈ వేలాన్ని స్థానిక టీవీల్లో, మీడియాలో ప్ర‌త్య‌క్ష‌ ప్రసారం నిర్వహించారు.సౌదీలో సంవ‌త్స‌రాలుగాసంప్రదాయ ఆట పాల్కనరీ (రాజుల క్రీడ) అంటూ డేగలతో చిన్న జంతువులను వేటాడించే ఏటా నిర్వహిస్తారు.అయితే.

దానిపై నిషేధం విధించిన అనంతరం 2019 ఫాల్కన్రీని నిర్వహించారు.

Telugu Crors, Eagle, Maal Ham, Palkanari, Soudhi Arabhiya-Latest News - Telugu

కింగ్ అబ్దులాజీజ్ ఫాల్కనరీ పండుగ‌ను ఏటా డిసెంబర్‌లో రియాద్‌లో నిర్వహిస్తారు.2019 లో ఈ ఆట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు ద‌క్కించుకుంది.ఆ సంవ‌త్స‌రం 2,350 ఫాల్కన్‌లు హాజరయ్యాయి.ఇందుకోసం ఇక్కడి ధనవంతులు ఈ వేటాడే పక్షులకు పెద్ద మొత్తం ధ‌ర చెల్లించి కొంటున్నారు.ఈ స్థాయి ధర గతంలో ఎన్నడూ లేదంటూ మీడియా వర్గాలు తెలిపాయి.ఇది ప్రపంచ రికార్డని పేర్కొన్నాయి.

ఈ ఇంటర్నేషనల్‌ ఫాల్కన్‌ బ్రీడర్ యాక్షన్‌లో 14 దేశాలకు చెందిన డేగల పెంపకందారులు పాల్గొన్నారు.గల్ఫ్ ప్రాంతంలో.

ఫాల్కన్‌ను కలిగి ఉండటం ఒక హోద‌గా చూస్తుంటారు.ఏదేమైనా డ‌బ్బులు ఉన్న‌వారు ఇలాంటివి చేయ‌డం చాలాకామ‌న్ అయినా గానీ నిరుపేద‌ల‌కు మాత్రం ఇవి చాలా పెద్ద విష‌యాలే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube