డిఫరెంట్ లుక్ లో విజయ్ సేతుపతి.. శృతి హాసన్ తో రచ్చ రచ్చ?

విజయ్ సేతుపతి ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు.ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడినవిజయ్ సేతుపతి ఆ తర్వాత సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని తన అద్భుతమైన నటనతో హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

 Vijay Sethupathi In A Different Look With Shruti Haasan Vijay Sethupathi, Shruti-TeluguStop.com

కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

విజయ్ సేతుపతి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అతనికి 96 అనే సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన విజయ్ సేతుపతి విజయ్ హీరోగా నటించినటువంటి మాస్టర్సినిమాలో విలన్ పాత్రలో కనిపించి సందడి చేశారు.ఆ తర్వాత తెలుగులో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో చేస్తూ తన అసలు విలనిజాన్ని బయటపెట్టారు.

ఈ విధంగా విభిన్న పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ సేతుపతి తాజాగా సరికొత్త లుక్ లో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

Telugu Kollywood, Labham, Shruti Haasan, Tollywood-Movie

ఎస్.పీ జననాథన్ దర్శకత్వంలో, లాయర్ శ్రీరామ్ సమర్పణలో, శ్రీ గాయత్రి దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ తెలుగులో విడుదల చేస్తున్నటువంటి చిత్రం లాభం ఈ సినిమాలో విజయ్ సేతుపతి శృతి హాసన్ జంటగా నటించారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని ఈ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాత తెలియజేశారు.

ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జగపతిబాబు, దన్షిక కీలక పాత్రలో నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube