వైరల్ పిక్: సరికొత్త ఆలోచనతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న నిరుద్యోగి..!

సరికొత్త ఆలోచనతో ఓ నిరుద్యోగి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.ఆ ఆలోచనేంటో తెలుసుకోవలనుందా.

 Viral Pic Ireland Man Chris Strange Thought For Getting A Job, Viral News, Socia-TeluguStop.com

అయితే ఈ కధ చదవాల్సిందే.బిజినెస్ పెంచుకోవడానికి రకరకాల పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు ఉంచడం చూసుంటాము.

కానీ ఉద్యోగం ఇవ్వండి అంటూ బ్యానర్లు, హోర్డింగ్ లు పెట్టడం ఎప్పుడైనా చూసారా.? లేదు కదా.కానీ ఓ నిరుద్యోగి అంత పని చేసాడు.300 సార్లు ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమై తనకు ఉద్యోగం రాకపోవడంతో అతడు ఒక ఆలోచన చేసాడు.ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టాడు.

ఇక ఏం జరిగిందంటే.ఉత్తర ఐర్లాండ్ కి చెందిన క్రిస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.ఉద్యోగం కోసం కాల్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగాడు.

కానీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది.ఒక వారంలో 300 సార్లు ఇంటర్వ్యూ లకు అట్టెండ్ అయ్యాడు.

కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు.అన్ని ఇంటర్వ్యూ లలో తిరస్కరించారు.

ఇక ఏం చేయాలో అర్థం కాక ఆలోచించడం మొదలు పెట్టాడు.ఇంతలో అతని సోదరి ద్వారా ఒక ఆలోచన వచ్చింది.

క్రిస్ సోదరి సామాజిక మాధ్యమాల్లో మేనేజర్ గా చేస్తుంది.ప్రకటన ప్రచారం కోసం బిల్ బోర్డులను ఇన్స్టాల్ చేసే పనిలో ఉండగా క్రిస్ కి ఈ ఆలోచన తట్టింది.

దీంతో ఉద్యోగం కోసం హోర్డింగ్లు పెట్టాలనుకున్నాడు.

Telugu Job Interviews, Boards, Chris, Chris Sister, Ireland, Strange Idea, Lates

ఇది ఖర్చుతో కూడుకున్న పని అయినప్పట్టికి డిజైనింగ్, పేపర్ వర్క్ చేసి మొత్తానికి తను అనుకున్న పని పూర్తి చేశాడు.ఇంకా మళ్ళీ మళ్ళీ ఉద్యోగం కోసం ఆఫీసుల చూట్టూ తిరగకుండా నగరం అంతా హోర్డింగ్లు ఏర్పాటు చేశాడు.ఇందుకోసం రూ.40 వేలు ఖర్చు చేసి తన ఫొటోతో సహా యాడ్ ఇచ్చాడు.అందులో తన చదువు, స్కిల్స్ కి సంబంధించిన వివరాలను ఉంచాడు.

దయచేసి నన్ను నియమించుకోండి అని హోర్డింగ్ లో రాసాడు.ఇక ఆ హోర్డింగ్లు చూసిన ప్రతి ఒక్కరు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యానికి గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube