శుభాకాంక్షల వెల్లువపై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

 Latest Tweet About On His Birhday Pavan Kalyan ,social Media,twitter-TeluguStop.com

కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.దీంతో సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు మోత మోగింది అని చెప్పాలి.

ఈ క్రమంలోనే తన పుట్టినరోజు కానుకగా తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళల క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

గత రెండు సంవత్సరాల నుంచి దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది.ఇప్పుడిప్పుడే రెండవ దశ నుంచి బయటపడుతున్నా, చాలామంది జీవితాలు గాడినపడటం లేదు.ఇలాంటి సమయంలో తాను పుట్టిన రోజు శుభాకాంక్షలను అందుకోలేననే ఉద్దేశంతో దైవచింతనలో గడిపాను సాధారణంగా నాకు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నచ్చవని అందరికి తెలిసిందే.

Telugu Pawan Kalyan, Tollywood-Movie

ఈ క్రమంలోనే తన శ్రేయస్సును కోరుతూ అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువులు, రాజకీయ మిత్రులు ఇలా ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమానురాగాలతో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మీ అందరి ప్రేమానురాగాలకు నేను కృతజ్ఞుడిని అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube