టీకాల రక్షణ తాత్కాలికమే.. గ్లోబల్ రీసెర్చ్ పరిశోధనలో వెల్లడి

భారత్ లో  covid-19 టీకాలు కార్యక్రమం నెమ్మదిగా సాగుతుందని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ తన పరిశోధన నివేదికలో వెల్లడించింది.దేశంలో త్వరలో కరోనా మూడో దశ ఉంటుందన్న నేపథ్యంలో ఆ సంస్థ నిర్వహించిన పరిశోధనలో అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

 Vaccine Protection Is Temporary   Global Research Reveals, Vaccine Protection ,-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తయారైన వ్యాక్సిన్లు వేసుకున్న వారు దానికి సంబంధించిన సామర్థ్యం క్రమంగా తగ్గుతునట్లు ఆ టీకాలు  రక్షణ ఎక్కువ కాలం ఉండటం అవకాశం లేదని నిర్ధారించారు.ఇంతకుముందు అనుకున్నట్లే ఈసారి మాత్రం ఏడాది కూడా ఉండే అవకాశం లేదని తేలినట్లు పేర్కొంది.

రెండు డోసులు టీకాలు వేసిన ప్రతి వ్యక్తిలో ఆ తర్వాత నెలల్లో ఆ వ్యాక్సిన్ సామర్థ్యం బాగా తగ్గుతుందని స్పష్టమైనట్టు తెలిపింది.కరోనా మూడో విడత తప్పదని వస్తున్న వార్తలతో ఈ పరిశోధనా అంశాలు టీకాలపై నమ్మకాన్ని తారుమారు చేశాయి.

ఇకపై కోవిడ్ పై కఠినమైన పోరాటం చేయక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.ప్రపంచ దేశాల్లో 95% లో అత్యధిక ప్రభావశీల గా ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారు దాని సామర్థ్యం కేవలం నాలుగు నెలల్లోనే 45 శాతానికి పడిపోయినట్లు వివరించింది.

ఇది తీవ్ర నిరాశ కలిగించే విధంగా ఆ పరిశోధన అభిప్రాయపడింది.ఇక దేశంలో 75 శాతం రక్షణ  కలిగి ఉందని భావిస్తున్న కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ల సామర్థ్యం కూడా నాలుగు నెలల్లో 54 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది.

వ్యాక్సిన్లు సామర్థ్యం తగ్గుదల వేగంగా ఉండటం దేశంలో టీకా కార్యక్రమానికి ప్రధాన అవరోధంగా మారే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటికీ టీకాలు కార్యక్రమం నెమ్మదిగా సాగుతుందని రెండు డోసులు టీకాలు పొందినవారికి ఆరు నెలల నుంచి 8 నెలలు వరకు  వరకు రక్షణ లభించేలా బూస్టర్ డోసు లు అందించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube