టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు.ఈయన సినిమాలు తీసే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
అయితే యాక్షన్ మరీ ఎక్కువైనా కష్టమే అని వినయ విధేయ రామ సినిమా నిరూపించింది.ప్రెసెంట్ బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ సినిమా ప్రకటించలేదు.
అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలనీ బోయపాటి ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచి పోయింది.
ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా యూట్యూబ్ లో కూడా మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రెసెంట్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు.
కానీ వేణు శ్రీరామ్ కు వకీల్ సాబ్ సినిమా అవకాశం రావడంతో ఈ సినిమాను పక్కన పట్టేసాడు.అయితే ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేస్తాడని అంత అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే ఐకాన్ సినిమా కనుక ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటే అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఐకాన్ సినిమా మీదనే ఇదంతా ఆధారపడి ఉందని సమాచారం.ఒకవేళ వేరే కారణాల వల్ల ఐకాన్ సినిమా వాయిదా పడితే తప్పితే బోయపాటి సినిమా స్టార్ట్ ఎవ్వడు.అందుకే ఇప్పుడు బోయపాటి భవిష్యత్తు ఐకాన్ సినిమా మీద ఆధారపడి ఉంది.
మరి చూడాలి ఏం జరుగుతుందో.