#PSPK28 ప్రీ లుక్ పోస్టర్.. ట్రీట్ అదిరిపోతుందిగా !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో అటు అభిమానులతో పాటు ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం పవన్ నామకరణతో హోరెత్తిపోతుంది.

 Pspk28 Pre Look Poster Released-TeluguStop.com

కేవలం విషెస్ మాత్రమే కాదు పవన్ సినిమాల అప్డేట్ లతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది.

ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్బముగా అన్ని సినిమాల నుండి వరుసగా అప్డేట్ లు ఇస్తూ మేకర్స్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.

పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ చెయ్యగా.హరిహర వీరమల్లు నుండి రిలీజ్ డేట్ ను ప్రకటించారు.ఈ రెండు అప్డేట్ లు మాత్రమే కాదు ఎవ్వరు ఊహించని విధంగా సురేందర్ రెడ్డి తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ అవ్వడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు.

అసలు వీరి కాంబో ఎవ్వరు ఊహించలేదు.

యథా కాలమ్.తథా వ్యవహారమ్ అనే లైన్స్ తో ఒక ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసారు.

యాక్షన్ సినిమాలను తెరకెక్కించే సురేందర్ రెడ్డి పవన్ ను ఎలా చూపిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది.

ఇక ఏఈ అప్డేట్ లతో పాటు పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే #PSPK28 సినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్.

Telugu Bheemla Nayak, Poster, Harish Shankar, Jathara, Pawan Kalyan, Pawankalyan

ఇది డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కాంబోలో తెరకెక్కబోతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించ బోతున్నారు.గత సంవత్సరం ఈ సినిమా గురించి ప్రకటించారు.

ఇక ఈ సంవత్సరం ఈ సినిమా పోస్టర్ విడుదల చేసారు.త్వరలోనే పవన్ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ల బోతున్నాడు.

ఈ పోస్టర్ లో ఇండియా గేట్ ముందు ఒక స్టైలిష్ బండి మీద పవన్ కూర్చుని ఉన్నట్టు చూపించారు.

Telugu Bheemla Nayak, Poster, Harish Shankar, Jathara, Pawan Kalyan, Pawankalyan

ఎంతో ఆతృతగా ఎదురు చుసిన పవన్ ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ నిరాశ కలిగించినట్టు కామెంట్స్ చేస్తున్నారు.ఇక జాతర అనే హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో ఈ సినిమా టైటిల్ ఇదే అని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన వీరి కాంబోలో మరొక సినిమా కోసం అభిమానాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube