ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలెంట్ చూపించిన నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనుదీప్ డైరక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించారు.
ఇక ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి ఒక సినిమా ఫిక్స్ చేసుకోగా ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లఏదు.ఇదేకాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా నవీన్ ఒక సినిమా కమిట్మెంట్ ఇచ్చాడట.
సితార నుండి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.
రంగ్ దే డైరక్టర్ వెంకీ అట్లూరితో నవీన్ హీరోగా ఒక సినిమా అనుకున్నారు.
అయితే నవీన్ కు వెంకీ చెప్పిన కథ కుదరడం లేదట.కథ ఓకే అనుకున్నా కథనం ఇంప్రెసివ్ గా లేదని చెప్పాడట అందుకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
అంతేకాదు కథ కుదిరిన తర్వాతే సినిమా చేద్దామని చెప్పి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడని టాక్.సితార లాంటి బ్యానర్ లో సినిమా చేస్తే నవీన్ కెరియర్ కు ప్లస్ అవుతుంది.
మరి తొందరపడకుండా ఆ బ్యానర్ తో టచ్ లో ఉంటేనే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.