అప్పట్లో కృష్ణ ఏడాదికి ఎన్ని సినిమాలు చేసేవారో మీకు తెలుసా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణగా పరిచయమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించిన కృష్ణ తేనె మనసులు సినిమాతో హీరోగా మారారు.

 Interesting Facts About Star Hero Super Star Krishna Movies, 18 Movies, Interest-TeluguStop.com

దాదాపు 40 సంవత్సరాల సినీ కెరీర్ లో 340కు పైగా సినిమాలలో కృష్ణ నటించారు.కృష్ణ సొంతంగా పద్మాలయ స్టూడియోస్ ను నెలకొల్పి దర్శకుడిగా 16 సినిమాలను తెరకెక్కించడం గమనార్హం.

ప్రేక్షకులకు తెలియని ఎన్నో కొత్త టెక్నాలజీలను, ఎన్నో జానర్ లను కృష్ణ తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.1964 నుంచి 1995 వరకు కృష్ణ 300 సినిమాలలో నటించగా సగటున ఏడాదికి పది సినిమాల చొప్పున నటించారు.మేకప్ మాన్ మాధవరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సంవత్సరం కృష్ణగారు 22 సినిమాలు చేశారని 22 సినిమాలలో 18 సినిమాలు అదే ఏడాది రిలీజయ్యాయని చెప్పుకొచ్చారు.

కృష్ణగారు, విజయనిర్మల గారు, తాను విజయవాడకు వెళితే ఎక్కడ ఏ వాల్ పోస్టర్ చూసినా కృష్ణగారిదే ఉండేదని మాధవరావు వెల్లడించారు.

Telugu Madhavarao, Krishna, Tene Manasulu, Tollywood, Vijaya Nirmala, Wall Poste

కృష్ణగారు రోజుకు మూడు షిఫ్టులు పని చేసిన రోజులు సైతం ఉన్నాయి.కృష్ణకు అభిమాన సంఘాలు సైతం రికార్డు స్థాయిలో ఉండేవి.అప్పట్లో కథ ఫిక్స్ చేసుకుంటే కథలో మార్పులు చేసేవాళ్లు కాదని మాధవరావు వెల్లడించారు.బీఎన్ రెడ్డిగారు కథ, డైలాగ్స్ పూర్తి చేసి సినిమాను తెరకెక్కించేవారని మాధవరావు చెప్పుకొచ్చారు.

Telugu Madhavarao, Krishna, Tene Manasulu, Tollywood, Vijaya Nirmala, Wall Poste

మోసగాళ్లకు మోసగాడు సినిమాను కేవలం 27 రోజుల్లో పూర్తి చేశామని మాధవరావు కామెంట్లు చేశారు.2010 సంవత్సరం నుంచి కృష్ణ సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.కృష్ణ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.మహేష్ బాబు, సుధీర్ బాబు నటులుగా మంచి పేరుతో పాటు విజయాలను సైతం సొంతం చేసుకుంటున్నారు.కృష్ణ నటనకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి.తనతో సినిమా తీసి నిర్మాత నష్టపోతే కృష్ణ ఏదో ఒక విధంగా సహాయం చేసి నిర్మాతను ఆదుకునేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube