వాట్సాప్‌లో ‘బ్లూ టిక్‌..లాస్ట్‌ సీన్‌’ను ఎలా హైడ్‌ చేయాలో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేస్తూ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది.అందుకే ఎంతోమంది వినియోగదారులను సంపాదించుకుంది.

 How To Hide Last Seen And Blue Ticks On Whatsapp , Blue Tic , Hide Whatsapp Chat-TeluguStop.com

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది.ఇక ఇప్పటికే ఇందులో ఉన్న కొన్ని ఫీచర్లు కొంతమందికి తెలియకపోవచ్చు.

అందులో మనం మెసేజ్‌ చేసేటపుడు అవతలి వ్యక్తి సదరు సందేశాన్ని చూశాడో లేదా? అని బ్లూ టిక్‌ ద్వారా తెలుసుకుంటాం.మనం వాట్సాప్‌లో లాస్ట్‌ సీన్‌ ఎపటి వరకు ఉన్నామన్న సంగతి మీ కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ సులభంగా తెలుసుకోగలరు.

అయితే, వాట్సాప్‌ సెట్టింగ్‌ను ఉపయోగించి ఈ రెండు ఫీచర్లను ఎలా హైడ్‌ చేయాలో ఆ వివరాలు తెలుసుకుందాం.వాట్సాప్‌లో ఉన్న అద్భుతమైన ఫీచర్లలలో ఇది ఒక్కటి.వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్‌ లాస్ట్‌ సీన్, బ్లూ టిక్‌ ఆప్షన్స్‌ను హైడ్‌ చేసే వీలుంటుంది.ఇప్పటి వరకు మీకు ఈ ఫీచర్‌ గురించి తెలియకపోతే, ఇక యాక్టివేట్‌ చేసుకోండి.

ఈ రెండు ఫీచర్లు వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌లోని ప్రైవసీ సెక్షన్‌లోనే అందుబాటులో ఉంటుంది.ఈ ఫీచర్లు కేవలం ఆప్షనల్స్‌ మాత్రమే.

ఎవరికైతే అవసరం లేదో వారు వాడనవసరం లేదనమాట.అయితే, ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్, డిసేబుల్‌ చేసుకోవాలో చూద్దాం.
<

వాట్సాప్‌లో లాస్ట్‌ సీన్‌ను హైడ్‌ చేసే విధానం

Telugu Blue Tic, Whatsapp Chat, Whatsapp View-Latest News - Telugu

మీకు వాట్సాప్‌లో లాస్ట్‌ సీన్‌ను హైడ్‌ చేయాలనిపిస్తే వాట్సాప్‌లోని సెట్టింగ్‌ సెక్షన్‌ను ఓపెన్‌ చేయాలి.అందులో అకౌంట్‌ సెక్షన్‌లోని ప్రైవసీపై క్లిక్‌ చేయాలి.ఇది రెండూ మొబైల్, వెబ్‌ వెర్షన్‌లకు వర్తిస్తుంది.ఆ తర్వాత లాస్ట్‌ సీన్‌’ ఆప్షన్‌లోని నోబడీ పై క్లిక్‌ చేయాలి.ఇందులో మూడు ఆప్షన్లు ఉంటాయి ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ మొదటిది మీ కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరి నంబర్లు, రెండోది, కేవలం మీరు సేవ్‌ చేసుకున్న కాంటాక్ట్‌ నంబర్లు.చివరిది ఏ ఒక్కరూ మీ లాస్ట్‌ సీన్‌ను చూడలేరు.

వాట్సాప్‌లో బ్లూ టిక్‌ను హైడ్‌ చేయడం

Telugu Blue Tic, Whatsapp Chat, Whatsapp View-Latest News - Telugu

ఈ ఫీచర్‌ కూడా ప్రైవసీ సెక్షన్‌లోనే అందుబాటులో ఉంటుంది.వాట్సాప్‌లో రీడ్‌ రిసిప్ట్స్‌ ఆప్షన్‌ ఉంటుంది.దాంతో బ్లూ టిక్‌ను డిసేబుల్‌ చేస్తుంది.వాట్సాప్‌ సెట్టింగ్‌లోని అకౌంట్‌ సెక్షన్‌లోని ప్రైవసీ సెక్షన్‌లోకి వెళ్లాలి.రీడ్‌ రిసీప్ట్స్‌ ఆప్షన్‌లో స్క్రీన్‌ను కిందికి స్క్రోల్‌ చేసి, బ్లూ టిక్స్‌ ఆన్‌ చాట్స్‌ ను డిసేబుల్‌ చేస్తే సరిపోతుంది.ఈ విధంగానే మళ్లీ ఎప్పుడైనా ఆప్షన్స్‌ను మార్చుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube