బడ్జెట్‌ మీడియంగా ఉంటే లాభాలు ఖాయం.. ఇదే సాక్ష్యం

ఈమద్య సినిమాలను కాస్త పద్దతిగా ప్లాన్‌ తో నిర్మిస్తే నిర్మాతలకు లాభాలు తప్ప నష్టాలు అనేవి ఉండవు.సినిమా కథ, దర్శకుడు, హీరో, హీరోయిన్‌ ఇలా ప్రతి విషయంలో కూడా బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే సినిమాను తీయాల్సి ఉంటుంది.

 Sridevi Soda Center Movie Budget And Collections , Sridevi Soda Center , Movie ,-TeluguStop.com

అలాంటి హద్దులు లేకుండా ఇష్టానుసారంగా బడ్జెట్‌ ప్లాన్‌ చేయకుండా సినిమాను తీస్తే ఖచ్చితంగా బొక్క బోర్లా పడటం అవుతుంది.పెద్ద ఎత్తున బడ్జెట్‌ ను ఖర్చు పెట్టిన సినిమాలకు నష్టాలు మిగిలిన సందర్బాలు చాలా ఉన్నాయి.

కనుక సినిమాను మీడియం బడ్జెట్ తో తీయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేస్తుంటారు.కాని కొన్ని సార్లు ఆ బడ్జెట్‌ దాటి పోతుంది.

అప్పుడు సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయితేనే లాభాలు వస్తాయి.కొన్ని సార్లు సక్సెస్ అయినా లాభాలు వచ్చిన దాఖలాలు లేవు.తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యావరేజ్‌ టాక్ దక్కించుకున్నా కూడా నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి.సినిమా వల్ల నిర్మాతకు విడుదలకు ముందే లాభాలు వచ్చాయి.

Telugu Medium Budget, Telugu, Sridevisoda, Sudheer Babu, Tollywood-Movie

సినిమాకు వచ్చే పబ్లిసిటీ ని బట్టి కూడా మార్కెట్‌ ఉంటుంది.కనుక సినిమా షూటింగ్ సమయంలోనే మార్కెట్‌ చేసుకుని దాన్ని బట్టి కూడా బడ్జెట్‌ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇటీవల వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బడ్జెట్‌ తక్కువ ఉండటంతో పాటు మంచి పబ్లిసిటీ చేయడం వల్ల అనుకున్నదాని కంటే ఎక్కువ బిజినెస్ అయ్యింది.ఈ సినిమాకు రూ.8 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.బడ్జెట్‌ కంటే ఎక్కువగా నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా వచ్చాయి.

దాదాపుగా 13 కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా వచ్చాయని సమాచారం.ఏడు కోట్ల రూపాయలు థియేట్రికల్‌ రైట్స్ ద్వారా వచ్చాయట.మొదటి రోజులో 1.5 కోట్ల వరకు వసూళ్లు నమోదు అవ్వగా తర్వాత సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube