శయన స్థితిలో ఉండే హనుమాన్ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

రామాయణంలో సీతమ్మ జాడని కనుక్కోవడం కోసం హనుమంతుడు చేసిన సాహసాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పటి నుంచి ఆంజనేయ స్వామిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు.

 Unknown Facts Of The Temple Known As Bhadra Maruthi , Bhadramaruthi Temple, Hanu-TeluguStop.com

ఈ క్రమంలోనే మనకు ఏ గ్రామం వెళ్ళినా ఆంజనేయ స్వామి ఆలయం తప్పకుండా దర్శనమిస్తుంది.ఇప్పటి వరకు మనకు ఆంజనేయస్వామి హనుమంతుడు, పంచముఖుడు, వరాల ఆంజనేయుడు, భక్తాంజనేయుడుగా భక్తులకు దర్శనమిచ్చారు.

కానీ మీరెప్పుడైనా ఆంజనేయస్వామి శయన స్థితిలో దర్శనమివ్వడం చూశారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మహారాష్ట్రకు వెళితే మనం ఈ విధంగా శయన స్థితిలో దర్శనమిచ్చే ఆంజనేయస్వామిని చూడవచ్చు.

మహారాష్ట్రలోని మరాట్వాడా అని పిలువబడే ఔరంగాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరా గృహాలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది.ఈ ఆలయాన్ని భక్తులు భద్ర మారుతి ఆలయం అని పిలుస్తారు.

ఈ ఆలయంలో మనం ఎక్కడా చూడని విధంగా ఆంజనేయస్వామి శయన స్థితిలో మనకు దర్శనమిస్తారు.ఈ విధంగా స్వామివారు దర్శనం ఇవ్వడానికి గల కారణాలు ఏంటనే విషయానికి వస్తే… పురాణాల ప్రకారం లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆంజనేయస్వామి మృతసంజీవనీ కోసం ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకు వచ్చాడు అనే సంగతి మనకు తెలిసిందే.

Telugu Aurangabad, Hanuman, Hanuman Temple, Lakshmanna, Maharastra, Pooja, Ramay

ఈ విధంగా ఆంజనేయస్వామి మృత సంజీవని పర్వతాన్ని తీసుకు వస్తున్న క్రమంలో అలిసిపోయి ఈ ప్రాంతంలో కాసేపు సేద తీరాడని అందువల్ల ఇక్కడ స్వామివారు శయన స్థితిలో భక్తులకు దర్శనమిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా స్వామి వారు శయన స్థితిలో ఉండటం చూసిన భక్తులు స్వామివారి పాదాలపై పడి లోకకళ్యాణం కోసం ఇక్కడే కొలువై ఉండి భక్తులను అనుగ్రహించమని కోరగా అందుకు స్వామివారు తను ఇక్కడ శయన స్థితిలో దర్శనం ఇస్తానని చెప్పారు.ఈ విధంగా శయన స్థితిలో భక్తులకు దర్శనమిచ్చే ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల సమస్యలు తొలగిపోయి సకల సుఖాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube