సాధారణంగా సినిమాల్లో హీరోలు ఆ పాత్ర ఎలా డిమాండ్ చేస్తే ఆ విధంగా చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఎంత కష్టమైనా కూడా పాత్రకు అనుగుణంగా తమ శరీరాకృతిని,వారి లుక్ కూడా మార్చుకోవలసి ఉంటుంది.
ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సినిమాలలో ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు.ఈసినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నడగా ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.అయితే పుష్ప సినిమాలో నటించడం కోసం అల్లు అర్జున్ బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.
లవర్ బాయ్ గా ఉండే అల్లు అర్జున్ ఈ మాస్ లుక్ లో కనిపించడం కోసం తనని తాను మేకోవర్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే ప్రతిరోజు సెట్లో ఈ విధమైనటువంటి లుక్ లో కనిపించడం కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడు గంటల సమయం పాటు తన మేకప్ కోసం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో కనిపించడానికి రెండు గంటల సమయం పాటు మేకప్ వేసుకుంటే ఆ మేకప్ తీయడానికి గంట సమయం పడుతుందని తెలుస్తుంది.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ డెడికేషన్‌ను చూసి దర్శకుడితో పాటు మిగిలిన చిత్రబృందం కూడా ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.