రికార్డు బ్రేక్ చేసిన హీరో సూర్య.. ఆరేళ్లలో 70 లక్షలమంది ఫాలోవర్స్!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో హీరో సూర్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

 Hero Suriya Crosses 7million Followers On Twitter, Suriya, Hero Suriya, Suriya C-TeluguStop.com

ఈ క్రమంలోనే వరుస సినిమాలతో సూర్య ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోని సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నటువంటి “జై భీమ్” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా ఇటు తెలుగు అటు తమిళంలో విడుదల కానుంది.

సూర్య సినిమాలలో మాత్రమే కాకుండా సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఆగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ ఎంతో మంది పిల్లలకు సహాయం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉండే సూర్య తనకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

Telugu Lakhs Followers, Suriya, Suriyacrosses, Suriya Craze, Surya, Tollywood-Mo

ఈ విధంగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న సూర్య తాజాగా ట్విట్టర్లో రికార్డు సృష్టించారు.ఆరు సంవత్సరాల క్రితం ట్విట్టర్ ఖాతా తెరిచిన సూర్య ఈ ఆరేళ్ల కాలంలో 70 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని అరుదైన రికార్డు దక్కించుకున్నారు.ఈ విధమైనటువంటి రికార్డు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాలేదని చెప్పవచ్చు.

ఈ విధంగా సూర్య ట్విట్టర్ ద్వారా అత్యధిక ఫాలోవర్స్ ని పెంచుకున్న సందర్భంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube