వాట్సాప్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్లాట్‌... ఈ విధంగా బుక్‌ చేసుకోండి!

కరోనా టీకా ఊపందుకుంది.ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చే రువ కావడానికి వాట్సాప్‌ ద్వారా కూడా కరోనా వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

 Now Can Book Covid Vaccine Slot Through Whatsapp.latest News-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుందాం.వాట్సాప్‌ ద్వారా కూడా మీకు దగ్గర్లో ఉన్న కొవిడ్‌ టీకా సెంటర్ల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

మీరు ఒకవేళ ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోకుంటే.ఇది మీకు మంచి అవకాశం వంటిది.

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ యాజమాన్యం మంగళవారం దీనిపై అధికారిక ప్రకటన చేసింది.ఇకపై వాట్సాప్‌ ద్వారా కూడా కరోనా హెల్ప్‌డెస్క్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

వాట్సాప్‌ వినియోగదారులు తమ ఇంటికి దగ్గరలో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్ల వివరాలు సులభంగా పొందవచ్చన్నారు.టీకా స్లాట్‌లను ఈజీగా బుక్‌ చేసుకోవచ్చని వాట్సాప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ కాథ్‌కార్ట్‌ ట్వీటర్‌లో తెలిపారు.

వాట్సాప్‌ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తుందని.వాట్సాప్‌ ద్వారా ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకాను బుక్‌ చేసుకోవచ్చన్నారు.

ఈ ట్వీట్‌తోపాటు వాట్సాప్‌ లింక్‌ను కూడా ఆయన ట్వీటర్‌లో షేర్‌ చేశారు.ఆగస్టు ప్రారంభంలోనే మై గవర్నమెంట్‌తో వాట్సాప్‌ జత కట్టింది.

దీంతో వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్స్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.అధికారిక నివేధికల ప్రకారం ఇప్పటి వరకు వాట్సాప్‌ ద్వారా దాదాపు 32 లక్షల మంది కరోనా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

దీనిపై మై గవర్న్‌మెంట్‌ వెబ్‌సైట్‌ సీఈఓ అ«భిషేక్‌ సింగ్‌ కూడా మాట్లాడుతూ.వాట్సాప్‌ ద్వారా కేవలం వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాకుండా .వ్యాక్సిన్‌ సెంటర్లను కూడా లోకేట్‌ చేయడం ద్వారా వినియోగదారులకు మరింత సులభతరమవుతుందన్నారు.వాట్సాప్‌ వాడటం చాలా మందికి సులభం.

అందుకే ఈ వేదిక మీదుగా టీకా బుక్‌ చేసుకునే వెసులుబాటుతో ప్రజలు మరింత లబ్ధి పొందుతారన్నారు.

Telugu Covid Vaccine, Coronavaccine, Latest, Whatsapp-Latest News - Telugu

వాట్సాప్‌లో వ్యాక్సిన్‌ బుక్‌ చేసుకునే విధానం ముందుగా మీ ఫోన్‌ కాంటాక్ట్‌లోకి మై గవర్న్‌మెంట్‌ కరోనా హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ 9013151515 ను సేవ్‌ చేసుకోవాలి.ఆ తర్వాత వాట్సాప్‌ చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి.‘బుక్‌ స్లాట్‌’ మెసేజ్‌ను పంపించాలి.వెంటనే మీకు ఓటీపీఎస్‌ఎంఎస్‌రూపంలోఅందుతుంది.మీకునచ్చినతేదీతోపాటు,ఏరియాపిన్‌కోడ్,ఏవ్యాక్సిన్‌కావాలో చాట్‌ బాక్స్‌లో నమోదు చేయాలి.అప్పుడు మీకు ఫోన్‌ ద్వారా కన్ఫర్మేషన్‌ వస్తుంది.

దీంతో వాట్సాప్‌ యూజర్లు కేవలం సర్టిఫికేట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాకుండా.టీకా కూడా పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube