కరోనా సోకిందా.. ఇంట్లోనే వుండండి, బయటకొస్తే ఐదేళ్ల జైలు: అమెరికా లోని ఆ రాష్ట్రం లో సంచలన ఆదేశాలు

అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న మొన్నటి వరకు ఫ్లోరిడాలో మాత్రమే డెల్టా వేరియంట్ తీవ్రత అధికంగా వుండేది.

 Mississippi Orders Covid-infected Individuals To Isolate At Home Or Face Up To 5-TeluguStop.com

తాజాగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి.ముఖ్యంగా మిస్సీస్సీపీలో పరిస్థితులు అదుపు తప్పేలా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, మందులు ఇతర వైద్య పరికరాలను అందుబాటులో వుంచింది.

అయితే వైరస్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్‌లో వుండకుండా రోడ్ల మీద సంచరిస్తున్నట్లు గుర్తించిన సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా పాజిటివ్ వ్యక్తులు కనీసం 10 రోజుల పాటు ఆరోగ్య వంతులకు దూరంగా ఐసోలేషన్‌లో వుండాలని సూచించింది.ఈ ఆదేశాలను అతిక్రమిస్తే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 డాలర్ల జరిమానా విధిస్తామని మిస్సిస్సీప్పీ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేసింది.

Telugu America, Mississippi-Telugu NRI

మరోవైపు మిస్సీస్సీపీలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.జనవరిలో వెలుగుచూసిన సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు మరోసారి చోటు చేసుకుంటున్నట్లు జాన్స్ హాప్‌కీన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.మిస్సీస్సీపీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1660 మంది చికిత్స పొందుతున్నారు.వీరరిలో 457 మంది ఐసీయూలో వుండగా.గత బుధవారం నాటికి 324 మంది వెంటిలేటర్లపై వున్నారు.మిస్సీస్సీపీ మెడికల్ సెంటర్ యూనివర్సిటీ.

రాష్ట్రంలోని ఏకైక లెవల్ 1 ట్రామా సెంటర్.దీంతో ఇక్కడి సిబ్బందితో పాటు విద్యార్ధులందరికీ టీకాలు వేయాలని నిర్ణయించారు.

సీడీసీ గణాంకాల ప్రకారం.మిస్సీస్సీపీ ప్రస్తుతం అమెరికాలో అతి తక్కువ టీకా రేటు వున్న రాష్ట్రాల్లో ఒకటి.ఇక్కడి మొత్తం జనాభాలో కేవలం 45.1 శాతం మంది మాత్రమే కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోగా.36.8 శాతం మందికి రెండు విడతల వ్యాక్సిన్ ముగిసింది.ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనిలో భాగంగా మిస్సీస్సీపీకి అదనపు వ్యాక్సిన్ డోసులను పంపినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube